Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడ్డిస్ అబబ (ఇథియోపియో) : సుదీర్ఘకాలంగా ఉన్న చైనా-ఆఫ్రికా మధ్య బంధం విభిన్న పరిస్థితుల్లోనూ కొనసాగుతోందని ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్ క్వేసీ క్వర్టీ తెలిపారు. కోవిడ్-19ను ఎదుర్కొవటానికి ఏయూకు వైద్య సామాగ్రిని చైనా విరాళంగా అందచేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికాలో కరోనా వైరస్ వృద్ధి చెందకుండా, ఈ మహమ్మారిపై ఆఫ్రికన్ల పోరాటానికి మద్దతుగా వైద్య సామాగ్రి, మందులను చైనా అందచేస్తుంది. చైనా శాంతియుత వృద్ధి ఆఫ్రికాకే కాకుండా మిగతా ప్రపంచం మొత్తానికి ఒక మంచి పాఠమని క్వర్టీ పేర్కొన్నారు. అద్భుతమైన విరాళం అందచేసిన చైనా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాస్త్ర సాంకేతిక, సోషల్ ఇంజనీరింగ్.. తదితర రంగాల్లోనూ అభివృద్ధి కోసం ఒకరికొకరు కలిసి పనిచేస్తామని అన్నారు.