Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జార్జి హత్యకు వ్యతిరేకంగా నిరసనలు
మినియాపోలిస్ : అమెరికాలో ఒక పోలీసు కర్కశకత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. శుక్రవారం అమెరికాలోని పలు నగరాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. పలుచోట్ల అధికారులు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నప్పటికీ వాషింగ్టన్ డీసీ, లూయిస్విల్లె, న్యూయార్క్, అట్లాంటా. దెన్వార్, తదితర నగరాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా, 'జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగాదెన్వార్ ప్రాంతాంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గ్రెనేడ్లు, బాష్పవాయువు ప్రయోగించారు. గురువారం ఆందోళనకారుడ్ని ఒక కారు ఉద్దేశపూర్వకంగా ఢకొీట్టిన విషయాన్ని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రం వరకూ కొనసాగిన ఉద్రిక్తతలు శనివారం కూడా కొనసాగాయి. పలుచోట్ల చిన్నపాటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండియానాపోలిస్లో శాంతియుంతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు రబ్బర్ బులెట్లు ప్రయోగించడంతో పాటు బాష్పవాయువులను ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జార్జి హత్యను ఖండించిన ఐరాస
జార్జి హత్యను ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం హైకమిషనర్ మిచ్చెల్లె బాచెలెట్ ఖండించారు. అనేక సంవత్సరాలుగా అమెరికా పోలీసుల చేతుల్లో అనేక మంది నల్లజాతీయులు హత్యకు గురవుతున్నారని అన్నారు. 'విధానాలు మారాలి. నివారణ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలి. అన్నింటికంటే మిన్నగా అధిక బలగాలను వినియోగించి నేరాలపై పాల్పడే పోలీసులపై కేసులు నమోదు చేసి శిక్షించాలి' అని తెలిపారు.