Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్తను ఖండించిన ట్రంప్
వాషింగ్టన్ : రష్యా- తాలిబన్ల మధ్య సంబంధాలు ఉన్నట్టు తనకు తెలుసునని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షులు డోనాల్ట్ ట్రంప్ ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనికులను హత్య చేయడానికి తాలిబన్ల ఉగ్ర వాదులకు రష్యా సుపారీ ఇచ్చిందనీ, ఈ సమాచారం నిఘా వర్గాలు ట్రంప్‌నకు వివరించాయని న్యూయార్క్ టైమ్స్‌లో కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఈ కథనాలను ట్రంప్ ఖండించారు. 'ఫేక్‌న్యూస్ టైమ్స్ చెప్పినట్టు ఈ సమాచారం గురించి ఎవ్వరూ నాకు వివరించలేదు' అని ట్రంప్ ట్వీట్ చేశారు. 'దీనిని అందరూ ఖండిస్తున్నారు, అక్కడ మనపై ఎలాంటి దాడులు జరగలేదు, రష్యాపై ట్రంప్ ప్రభుత్వం కంటే కఠినంగా ఎవ్వరూ వ్యవహరించలేరు' అని వరుస ట్వీట్లలో ట్రంప్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలను చంపడానికి రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ తాలిబన్ ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టు అమెరికా నిఘా వర్గాలు తేల్చాయని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం తన కథనంలో తెలిపింది. ఈ వార్తలను రష్యా, తాలిబన్లు ఇప్పటికే ఖండించాయి. ఇవి నిరాధారమైన, అనామక వార్తలు అని వాషింగ్టన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది.