Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్‌పై ఒబామా ఆగ్రహం
వాషింగ్టన్ : ఎన్నికల ర్యాలీల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించి 'కుంగ్ఫ్లూ' అనే పదంతో కూడిన జాత్యహంకార భాషను వినియోగిస్తూ ఆసియా వ్యతిరేక సెంటి మెంట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తు న్నారని ఆయన పేర్కొన్నట్లు స్థానిక మీడియా సోమవారం పేర్కొంది. ' ఆసియా వ్యతిరేక భావనను రెచ్చగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు చురుగ్గా వ్యహరించడం, దాన్ని ఫన్నీ అని భావించే దేశాన్ని నేను కోరుకోను. అది ఇప్పటికీ నన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది' అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి గత వారం డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జోరుబిడెన్ తరపున ఒబామా నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ట్రంప్ ఇప్పటికే ర్యాలీలు ప్రారంభించారు. ఈ నెలలో తుల్సా, అరిజోనాల్లో జరిగిన ర్యాలీల్లో ట్రంప్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ విధంగా 'కుంగ్ఫ్లూ' అనే జాత్యహంకార పదాన్ని వినియోగించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి ట్రంప్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు చైనా లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియన్ అమెరికన్లపై అమెరికాలో వేధింపులు జరుగుతున్నాయని మీడియా నివేదికలు వెల్లడించాయి.