Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : హాంకాంగ్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతం(హెచ్కెఎస్కెఆర్) జాతీయ భద్రతా సలహాదారుగా లువో హుయినింగ్ను చైనా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో చైనా, హాంకాంగ్ ప్రాంతీయ అధికారుల మధ్య సమన్వయకర్తగా లువో కీలక బాధ్యత నిర్వహించనున్నారు. దీంతో పాటుగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై మార్గనిర్దేశం చేయ నున్నారు. హాంకాంగ్ నగరంలో భద్రత, చట్ట విధానాల అమలుకు సంబంధిం చిన బాధ్యతపై చైనా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే సమయంలో లువోను సలహాదారుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నియామకం అత్యవసరమని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లువో హుయినింగ్ హెచ్కెఎస్ఎఆర్లోని కేంద్ర ప్రభుత్వ అనుసంధాన కార్యాలయ డైరెక్టర్‌గా జనవరి నుంచి ఉన్నారు. లువో ఒక రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి అని, కేంద్ర ప్రభుత్వ అంశాలపై పూర్తిగా ఆయనకు అవగాహన ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసంధాన కార్యాలయం నుంచి ఒక ఉన్నతాధికారిని నియమించడం హాంకాంగ్ నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర మరింత మెరుగవు తోందన్న విషయాన్ని సూచిస్తోందని చైనీస్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అండ్ మకావో స్టడీస్ కౌన్సిల్ సభ్యులు తాంగ్ ఫెయి శుక్రవారం పేర్కొన్నారు.