Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా 224వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. 224వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ట్రంప్ స్పందించారు. 'ధన్యవాదాలు మై ఫ్రెండ్, అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది' అని ట్విటర్లో పోస్ట్ చేశారు.