Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : ధనిక దేశాల కూటమి జీ-7 విస్తరణలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు చోటు ఉండాల్సిందేనని రష్యా పేర్కొంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న జీ-7 విస్తృత సదస్సుకు సంబంధించి తన పాత్ర గురించి అమెరికాతో ఇంకా చర్చించలేదని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ రాబ్కోవ్ శనివారం పేర్కొన్నారు. ఈ విస్తరణ జీ-7 సదస్సులో చైనా కూడా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 'గ్రూపు విస్తరణ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. చైనా ప్రస్తావన లేకుండా ఈ విస్తరణ ప్లాన్‌ను ఎలా రూపొందించారో అర్థ్ధం కావట్లేదు' అని తెలిపారు. మే నెలలో అమెరికాలో జరగాల్సిన జీ-7 సభ్యదేశాల సమావేశాన్ని ట్రంప్ సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. అదే సమయంలో సమ్మిట్‌లో చేరాలని ఆయన భారత్‌తో పాటు రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా ఇప్పటికే అంగీకరించింది.