Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లండ్‌లో కరోనా ప్రభావం
లండన్ : కరోనా వైరస్ విజృంభణతో బ్రిటన్‌లో మూడు నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి బ్రిటన్‌లో 59 ప్రధాన కంపెనీలు 1,95,00 ఉద్యోగులను తొలగించాయి. ఈ వివరాలను డైలీ మెయిల్ సోమవారం కథనంలో వెల్లడించింది.
రిటైల్, రవాణా, ఆసుపత్రి, తయారీ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలను తొలగించారు. ఇటీవల రోజుల్లో ప్రముఖ సంస్థలు హర్రోడస్, కాఫే రోజ్, బెల్లా ఇటాలియా, అర్కాడియా సుమారు 14 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. జులై 1, 2 తేదీల్లోనే సుమారు 10 వేల మందిని ఇంటికి పంపాయి.
సాండివిచ్ చైన్ సంస్థ ప్రెట్ ఏ మేనేజర్ తమ 30 షాపులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీనిని వలస 1000 ఉద్యోగాలు పోయాయి.
బ్రిటన్‌లో దుకాణాలు, వ్యాపారాల్లో 2020లో ఇప్పటి వరకూ 24,348 సంస్థలు దివాళా తీసినట్లు బహిర్గతమయిందని ది సెంటర్ ఫర్ రిటైల్ రిసెర్చ్ ప్రకటించింది. వీటిలో దశాబ్దాలు నుంచి కొనసాగుతున్నవీ కూడా ఉన్నాయి.
జులై 4 నుంచి కేఫ్‌లు, రెస్టారెంట్లు ప్రారంభించడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రెట్ సంస్థ తన 410 దుకాణాల్లో 339 మాత్రమే ప్రారంభించింది.
బ్రిటన్‌లో ప్రాచీనమైన డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ జాన్ లూయిస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో ఉన్నామని చెపింది. షూమేకర్ సంస్థ క్లార్క్స్ 700 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌లోనూ మిగిలిన సంస్థలు ఇదే దారిలో ఉన్నాయి.