Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : ప్రపంచవ్యాప్తంగా అంతా కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రష్యాలో తయారు చేసిన వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయనే సంతోషం కలిగిస్తోంది. ఈ విషయాన్ని రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ తెలిపారు.
రష్యాలోని గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పతి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 18న ప్రారంభించారు. పరీక్షలు చేపట్టిన తొలిగ్రూప్ వాలంటీర్లు బుధవారం డిశ్చార్జి కానుండగా, రెండో గ్రూప్ ఈ నెల 20న డిశ్చార్జి అవుతారని తారాసోవ్ చెప్పారు. ఈ దశ లక్ష్యం వ్యాక్సిన్ భద్రతను పరీక్షించడమని, అది విజయవంతంగా జరిగిందని యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్, లుకాషెవ్ వెల్లడించారు. టీకా భద్రత నిర్థారణ అయిందని, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళికలను ఇప్పటికే నిర్ణయించారని చెప్పారు.