Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెసిలియా : బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకి వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో 630కి పైగా కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 72 వేలను దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 24,831 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారం 1,701 మంది కరోనాతో మరణించగా, శుక్రవారం 1,200 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. జాన్ హాప్కిన్స్ విశ్వ విద్యాయలయం తాజా సమాచారం ప్రకారం.. బ్రెజిల్ అత్యధిక కరోనా మరణాలను కలిగిన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 1,35,000 మరణాలు నమోదవడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు బ్రెజిల్లో 18,64,681 కరోనా కేసులు నమోదయ్యాయి.