జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 42 మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు చనిపోవడం బాధాకరమని, ఈ దాడి దేశ భద్రతపై జరిగిన దాడిగా భావిస్తున్నామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని