హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈనెల 28న రానున్నారు. తిరిగి 30న ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే రాజీవ్ రహదారి నుంచి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకే్‌షకుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ సోమే్‌షకుమార్ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 28న ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. 29న యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటారు. అదేరోజు రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులతోపాటు అధికారులతో కలిసి తేనీటి విందులో పాల్గొంటారు. డిసెంబర్ 30న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు.
Recomended For You