Dec 04,2022 03:12PM
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబల్ హసన్ 5 వికెట్లతో టీమిండియా వెన్నువిరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (7) విఫలమయ్యాడు. షకీబ్ ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9)లను పెవిలియన్ చేర్చడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు.
Recomended For You