హైదరాబాద్: సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్ ను, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గురుకులాలను ఇంకా పెంచుతాం. చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చినం. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదన్నారు. కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టింది కాదన్నారు. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోష మని, ఏడేళ్ల క్రితం 60వేలకోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణలో ఉండే, నేడు 2.50లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టే వరకు రాగలిగాం. ఏడేళ్ల కిందట చాలా భయంకరమైన కరెంటు బాధలు అనుభవించిన తెలంగాణ నేడు దేశానికే తలమానికంగా, మనకు సమీపంలో ఏ రాష్ట్రం లేనివిధంగా, నేషనల్ యావరేజ్ క్లోజ్‌గా లేకుండా దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పేందుకు గర్వపడుతున్నా అని అన్నారు.
Recomended For You