Dec 05,2022 12:07PM
హైదరాబాద్: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతిచెందిన విద్యార్థి స్వగ్రామం బి.కోడూరు మండలం గోవిందపురం. మృతదేహాన్ని అధికారులు వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని విషయాలు తెలవాల్సి ఉంది.
Recomended For You