Dec 06,2022 02:35PM
హైదరాబాద్: తిరుపతి జిల్లాలోని ఓజిలి మండలం గ్రద్దకుంటలో విషాదం జరిగింది. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య అందులో కూరుకుపోయాడు. పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో ఇవ్వాళ కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. కుమారుడి మృతదేహం లభ్యం కాగా తండ్రి చెంగయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేబడుతున్నారు.
Recomended For You