Jan 25,2023 07:51AM
నవతెలంగాణ-న్యూఢిల్లీ : న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు. జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో క్రిస్ హిప్‌కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ వాగ్ధానం చేశారు. కొత్త ప్రధానికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో జసిందా ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత హిప్ కిన్స్ ప్రధానిగా కొద్దిమంది స్నేహితులు, సహోద్యోగుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Recomended For You