Jan 25,2023 12:36PM
నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారి సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. మంటల్లో ఇద్దరు కాలిబూడిదయ్యారు. 60 సంవత్సరాల వృద్ధురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Recomended For You