Jan 27,2023 06:52PM
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్‌డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
Recomended For You