Jan 27,2023 08:41PM
నవతెలంగాణ-హైదరాబాద్ : నందమూరి తారకరత్న కుప్పంలో యువగళం పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురికావడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం అని పేర్కొన్నారు. తారకరత్నను మెరుగైన చికిత్స కోస బెంగళూరు తరలిస్తున్నారని తెలిసిందని, త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తారకరత్న సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Recomended For You