Jan 27,2023 09:35PM
నవతెలంగాణ-హైదరాబాద్ : బిటెక్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు చెందిన భాను ప్రసన్న అదృశ్యమైంది. ఎంఎన్ఆర్ కాలేజీలో బిటెక్ భాను ప్రసన్న చదువుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసన్న సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని కాలేజికి వెళ్తున్నట్లు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గురువారం కాలేజికి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు చెందారు. దీంతో శుక్రవారం ఉడయం తల్లిదండ్రులు స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Recomended For You