Feb 06,2023 09:51PM
నవతెలంగాణ- హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద సోమవారం సాయంత్రం ఆటో-టాక్టర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పతికి తరలించారు. మృతులను మాడ్గుల మండలానికి చెందిన సత్యనాయక్, శాంతి, అభి (7)గా గుర్తించారు. పోలీసులు సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recomended For You