Mar 19,2023 11:35AM
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవీన్ ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన హరిహర కృష్ణ అమ్మాయి కోసం నవీన్ ను అత్యంత పాశవీకంగా నవీన్ తల, మొండెం వేరుచేసి, వేళ్ళు కత్తిరించి, గుండె బయటకు తీసి, మరణ హోమానికి పాల్పడ్డాడని తెలిసిందే. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నవీన్ మర్డర్ కేసులో నిందితురాలిగా ఉన్న నిహారిక జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలులో ఉన్న ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. నిహారిక ప్రేమ కోసమే హరిహరకృష్ణ నవీన్ ను హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ వద్ద హత్య చేసి ముక్కలుగా నరికాడు. అతని గుండెతో పాటు ఇతర అవయవాలను బయటకు తీసి ఆమెకు వాట్సాప్ లో ఫోటోలు తీసి పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Recomended For You