Mar 19,2023 02:56PM
నవతెలంగాణ - తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తులు టీబీసీ దాటి క్యూలైన్లో దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 75,452 మంది భక్తులు దర్శించుకోగా 39,262 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
Recomended For You