Mar 19,2023 03:37PM
నవతెలంగాణ - రంగారెడ్డి: తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. నిందితుడు హరిహరకృష్ణ, అతని స్నేహితుడు హసన్, నిహారికను పోలీసులు విచారించారు. అయితే..నవీన్ హత్యకేసులో నిందితురాలైన నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారికకు రంగారెడ్డి కోర్టులో ఆదివారం ఊరట లభించింది. రంగారెడ్డి కోర్టు నిహారికకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి నిహారిక విడుదలైంది.
Recomended For You