Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు

Sun 11 Dec 01:11:13.253793 2022

          అడవిలో పుట్టి.. అడవిలో పెరిగిన 'కొయ్య' నిర్మల్‌ కళాకారుల చేతిలో పడిందంటే చాలు.. వారి చేతిలో 'ఆకులో ఆకై.. పూవులో పూవై.. కొమ్మలో కొమ్మయి.. బొమ్మలో బొమ్మగా జీవకళని సతరించుకుంటుంది. శ్రమైక బిగువు, చెమటలోని ఎరువును ఆపాదింపజేసుకుని నాగరికుల ఇండ్లలో అలంకారమవుతుంది. ఆ కొయ్యల్నే ఆసరా చేసుకుని అందమైన బొమ్మలుగా తయారు చేస్తారు. ఆ బొమ్మలే కంటిని మైమరిపించే వర్ణాలుగా చిత్రీస్తారు. ఆ చిత్రాల్నే మదిని దోచుకునే సొగుసులుగా మలుస్తారు. అవి ఇంధ్రదనస్సులాంటి హరివిల్లులుగా పూయిస్తారు. చివరకు బాపు బొమ్మను తలపించే ప్రతిరూపాలుగా చెక్కుతారు. ఇంతకు వారెవరు? ఆ ప్రతిరూపాలేంటి అనుకుంటున్నారా..?. చేతినే కుంచెగా మలచి తమ ప్రతిభను ప్రపంచానికి చాటిన 'నిర్మల్‌ కళాకారులు' వారు. మనిషి తన జీవన విధానంలో వాడుతున్న వస్తువులకు ప్రతిరూపాలే ఆ 'కొయ్య బొమ్మలు'.భారత హస్తకళల వారోత్సవాల సందర్భంగా నిర్మల్‌ కొయ్యబొమ్మల చరిత్ర, వారసత్వ కళపై ఈవారం 'సోపతి' కవర్‌ పేజీ కథనం..
           ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌ కొయ్య బొమ్మలకు సుమారు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దశాబ్దాలుగా వస్తున్న వారసత్వ సంపదను కాపాడుకుంటున్న చరిత్ర ఆ ప్రాంతానిది. కొత్తగా వస్తున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌పై మోజు పెరుగుతున్నా కొయ్యబొమ్మలకు ఆదరణ తగ్గలేదు. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రూపాలు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్‌ చేయడం, విక్రయించడం తరతరాలుగా చేస్తున్నారు. అయితే ఇలాంటి నైపుణ్యం దేశంలో చాలా తక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్‌లో తప్ప ఈ కళ ఎక్కడా కనపడదు. చెక్కలతో తయారు చేసిన కొయ్యబొమ్మలు ప్రపంచ ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. పక్షులు, జంతు వులు, ఫలాల వంటి బొమ్మ లకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా ఈ ప్రాంతం పేరుగాంచింది. కూలీలు కష్టపడి పని చేయడానికి రెక్కలు చేసుకున్నట్టు ఈ కళాకారులు తమ చేతిని చెక్కలుగా మార్చుకున్నారు. కొయ్యలకు కొత్త రూపాలనిచ్చారు. వారు తయారు చేసే బొమ్మలు రానురానూ ఉపాధిగా మారి కొత్త కళరంగాన్ని సృష్టించింది. ఇండ్లకే పరిమితమైన ఈ బొమ్మల ప్రాధాన్యత కొన్ని రోజుల్లోనే ఇతర ప్రాంతాలకు పాకింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారు ఈ బొమ్మలను కొనుగోలు చేయడంతో కళాకారులు దాన్నే వృత్తిగా మలుచుకున్నారు.
సహజత్వం ఉట్టిపడేలా బొమ్మలు..
           ఇక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరును పొందాయి. ఈ బొమ్మల తయారీకి అడవుల్లో లభించే 'పొనిక' కర్రను ఉపయోగిస్తారు. ఇది లైట్‌ వెయిట్‌గా ఉంటుంది. ఈ చెక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే దొరకడం ప్రత్యేకం. వనమూలికలు, సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారు చేస్తారు. అందువల్ల ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తాయి. పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకుని ఆ బొమ్మను ఆకారంగా మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురును ఉపయోగిస్తారు. దాంతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మ లకు అతికించి స్వరూపం కల్పిస్తారు. ఆ తరువాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు, సహజ వర్ణాలు ఉపయోగించి బంగారు వర్ణాన్ని తయారు చేస్తారు. రోజూ ఏదో రకంగా బొమ్మలకు పూత పూస్తూ సునితత్వాన్ని తీసుకొస్తారు. ఆర్డర్లను బట్టి సైజులు తీసుకుని నెల నుంచి నెలన్నర వరకు బొమ్మల్ని తయారు చేస్తారు.
1955లో సొసైటీ ఆవిర్భావం..
           నిర్మల్‌లో కొయ్యబొమ్మలకు పునాది వేసినవారు కూసాని నర్సిములు, రాచర్ల లింబయ్య, కోలకొండ గుండాజీ ముఖ్యులు. వారితో పాటు కొంతమంది ఉమ్మడిగా ఏర్పడిన కళాకారులు సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. కలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగారు. తర్వాత కాలంలో వచ్చినవారు వారి కొడుకులు, మనుమలు వారసత్వ కళను అదే తీరుగా కాపాడుకుంటూ వస్తున్నారు. 1955లో 'నిర్మల్‌ కొయ్య బొమ్మల సహకార సంస్థ'గా ఆవిర్భావించాక చేతినిండా పని దొరికింది. వారు తయారు చేసే బొమ్మ లకు శ్రమకు తగినట్టుగా పీస్‌కు ఇంత ధర అని ఫిక్స్‌డ్‌ చేయడంతో బేరం ఆడకుండా విక్రయాలు సాగుతున్నాయి. అయితే నాటి కాలంలో కలప చాలా సులభంగా దొరికేది. ఇప్పుడు టింబర్‌ డిపోలో ద్వారా కొనుగోలు చేసుకుని బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. గతంలో సబ్సిడీ లోన్లు, క్రాప్ట్‌ లోన్లు, పింఛన్లు కూడా కళాకారులకు ఉండేవి. ప్రస్తుతం అవి లేకపోవడంతో సొసైటీ ద్వారా తమ పనికి వచ్చిన వేతనంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై ఉపాధి పొందుతున్న వారి పిల్లలు వారసత్వ రంగమైనా ఈ కొయ్యబొమ్మల తయారీపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం తర్వాత తరం ప్రశ్నార్థకంగా మారింది.
తయారు చేసే బొమ్మలు..
           ఈ కళాకారులు తయారు చేసే కొయ్యబొమ్మల్లో పక్షులు, జంతు వులు, కూరగాయలు, ద్రాక్ష పండ్లు, లవం గాలు, యాలకులు, అగ్గిపెట్టె, సిగరెట్లు తదితరమైనవి ఉంటాయి. వీరు తయారు చేసిన లవంగాలు, యాల కులు, తమల పాకులు, సిగరెట్‌ పెట్టెలను చూస్తే సహజ త్వాన్ని మరిపి స్తాయి. దీనికి తోడు వీరు వేసే పెయింటింగ్స్‌ కూడా గొప్ప గానే ఉంటాయి. ముని కోపం వల్ల శిలా రూపం దాల్చిన గంధర్వకన్య, యుద్ధరంగంలో శ్రీకష్ణుడు అర్జునునికి చేసే గీతా బోధనలు, ప్రకతి సహజంగా ఏర్పడిన చిత్రాలు, దేవతా చిత్రాలు, పెండ్లిబొమ్మలు, ఏనుగులు, పులులు, నెమళ్లు, కొంగలు, గూటిపక్షులు నిత్యం మనం చూస్తున్నవాటిలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా నిర్మల్‌ కళా కారుల చతురతకు అద్దంగా నిలుస్తు న్నాయి. అయితే 1830లో నిర్మల్‌ ప్రాంతాన్ని దర్శించిన యాత్రా చరిత్ర కారుడు ఏనుగుల వీరా స్వామయ్య నిర్మల్‌ బొమ్మల గురించి చాలా రాశారు. నిర్మల్‌ బొమ్మలు, పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవిగా పేర్కొన్నారు. అయితే అతి పరిచయం వల్ల కలిగే ఉదా సీనతతో తమ బొమ్మల విశిష్టత తమకే తెలియడం లేదని, అందుకే ఒక ఇంట్లో చూసినా నిర్మల్‌ పంచపాత్రలు వాడుకలో కనిపించట్లేదని చెప్పుకొ చ్చారు. తర్వాత తరం దీనిపై దృష్టి సారించడంతో ఇప్పుడు 'ఇంతింతై వటుడింతై' అన్నట్టుగా ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం నిర్మల్‌ వాసులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు తీసుకుని మరీ కొయ్య బొమ్మలను విక్రయిస్తున్నారు.
అమ్మకాలు..
           నిర్మల్‌లోనే అమ్మకాలు ఉండే ఈ బొమ్మలు తర్వాత కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ విక్రయించడం మొదలు పెట్టారు. ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినవారు, నిర్మల్‌ ప్రాంతం నుంచి టూర్‌కు వెళ్లేవారు ఈ కొయ్యబొమ్మలను కొనుక్కుని ఇష్టమైనవారికి బహుమతులు గా ఇచ్చేవారు. మరికొంతమంది ఇంట్లో అలంకారానికి తీసుకెళ్లేవారు. వీరు తయారు చేసిన బొమ్మలు రూ.50 నుంచి మొదలుకుని రూ.50వేల వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపో రియం ద్వారా అమె రికా, రష్యా, అరేబియా, మలేషియా, ఇరాన్‌, దుబారు, స్విట్జ ర్లాండ్‌, సింగ పూర్‌, తదితర దేశాలకు నిర్మల్‌ బొమ్మలను ఎగు మతి చేస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ అమెజాన్‌.కామ్‌ తెలంగాణలోని ప్రముఖ ఉత్పత్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది.
'బంగారు పూల వర్షం'
           నిర్మల్‌ సంస్థానాన్ని పరిపాలించిన నిమ్మ నాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్‌కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచాడు. దీంతో నిర్మల్‌లో 17వ శతాబ్దంలో నిర్మల్‌ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. నకాషీ కులానికి చెందిన కళాకారులు ఈ బొమ్మల తయారీలో నిమగమై వీటిని తయారు చేస్తారు. నిజాం నవాబు ఓసారి నిర్మల్‌ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంలో ఆయనకు సకల లాంఛనాలతో నవాబు స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంలో కూర్చోగానే పైనుంచి ఆయనపై పూలవర్షం కురిసింది. అవి మామూలు పూలు కావు బంగారు పూలు. అచ్చు బంగారు పువ్వులను మరిపించే పూల వర్షం కురిపించారు. అయితే అవి బంగారు పుష్పాలు కావు. బంగారు పుష్పాల్లా భ్రాంతిని కలిగించే విధంగా నిర్మల్‌ కళాకారులు సష్టించిన కత్రిమ పుష్పాలవి.
8 నుంచి 14వరకు హస్త కళల వారోత్సవాలు..
           దేశంలో ప్రతి యేటా డిసెంబర్‌ 8నుంచి 14వరకు హస్త కళల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తోంది. హస్త కళల ద్వారా తయరైన వస్తువులను ఈ వారం రోజుల పాటు సామాన్యులకు అందుబాటులో ఉంచుతారు. హస్తకళలను ప్రోత్సహిస్తూ తగిన ధరలను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ వారోత్సవాల్లో హస్తకళల నిపుణుల్ని సన్మానించుకోవడం, వారి ఉత్పత్తులను వాడుతూ ప్రోత్సహిం చడం చేస్తారు. హస్తకళల ద్వారా చేనేత వస్త్రాలు,అలంకార వస్తువులు, ఆహార పదార్థాలు, కళా ప్రదర్శనలు అందుబాటులోకి వచ్చాయి.అయితే ఈ వారోత్సవాలు నిర్వహించడంతో పాటు హస్తకళల అభివృద్ధి కోసం నైపుణ్యత శిక్షణా తరగతులను నిర్వహించడం చేయాల్సి ఉంది. ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రెండు మూడు రోజులే ఇవ్వడంతో తగినంత నేర్చుకోవడం లేదు. హస్తకళలను అభివృద్ధి చేసుకోవడానికి కళాకారులకు శాశ్వత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే గనుక కొత్తవారు ఈ కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది.
వారసత్వ సంపదను కాపాడాలి..
           దంపతులిద్దరం 25 ఏండ్లుగా పని చేస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యను చదువు తున్నారు. నెల రోజులు ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడు స్తుంది. సొసైటీ ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలివ్వాలి. టింబర్‌ డిపోలా ద్వారా చెక్కను కొనుక్కొని రావడం, రంగులకు కూడా మేమే డబ్బులు వెచ్చిస్తున్నాం. మాకొచ్చే దాంట్లో ఇది మరింత భారం అవుతున్నది. గతంలో తక్కువ ధరకే కలప దొరికేది. ఇప్పుడు రేట్‌ పెరడగంతో పాటు కర్ర కూడా సరిగా దొరకడం లేదు. దీనికి తోడు మా తండ్రుల నుంచి వచ్చిన వారసత్వ కళను కాపాడుతున్నాం. కానీ మా పిల్లలు దీన్ని ఇష్టపడటం లేదు. దినమంతా కూర్చొని చేసే పనిపై అయిష్టత ఉన్నది. అందుకే ప్రభుత్వం కొత్త కళా కారుల ద్వారా వారసత్వ సంపదను కాపాడాలి.
- కోలకొండ శ్రీనివాస్‌, కళాకారుడు

మానాన్నకు 'శిల్పగురు' బిరుదు
           మా తండ్రి ఆ కాలంలోనే పోచమ్మ విగ్రహాన్ని తయారు చేశాడు. దాన్ని దేశంలో టెక్స్‌టైల్‌ ఎగ్జిబిషన్‌లో పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరపున అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం మానాన్నను 'శిల్పగురు'గా బిరుదిచ్చి సన్మానించింది. అప్పటి నుంచి ఇదే మా నాన్న చేసిన పనిలోనే కొనసాగుతున్నాం. మా తరం ఎలాగో గడిచి పోయింది. కానీ పిల్లలకు ఆధారం లేదు. ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంతో పాటు కళా కారులకు నెలకు రూ.5వేలు పింఛన్‌ ఇవ్వాలి. విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. అప్పుడే ఈ రంగంతో పాటు మా జీవితాలు బాగుపడతాయి.
- రాచపల్లి కిషన్‌, కళాకారుడు

చిన్నప్పటి నుంచే పనిచేస్తున్నా...
           మావాళ్లను చూసి చిన్నప్పటినుంచి పనిచేస్తున్నాం. చదువు, సంధ్యమేమీ లేవు. ఇప్పటికీ కొయ్యబ్మొల తయారే మా పని, ఇదే మా బతుకు. వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు తప్ప చిల్లిగవ్వ మిగలడం లేదు. గతంలో బీసీ కార్పొరేషన్‌ నుంచి లోన్లు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని ఎత్తేశారు. లోన్లను పునరుద్ధరిస్తే బాగుం టుంది. అలాగే కొత్తవాళ్లకు ట్రెయినింగ్‌ ఇస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. లేదంటే రానురానూ కొయ్య బొమ్మల తయారీ రంగం అంతరించే ప్రమాదం ఉన్నది.
- నాంపల్లి శ్రీనివాస్‌, కళాకారుడు

- నమిలికొండ అజయ్‌కుమార్‌

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రంగ‌స్థ‌ల‌మే ఆయుధం
చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
కళాతపస్వి విశ్వనాథ్‌
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.