Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కళాతపస్వి విశ్వనాథ్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

కళాతపస్వి విశ్వనాథ్‌

Sun 05 Feb 04:00:53.72162 2023

           వాహిని స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసి, జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని చెప్పిన గొప్ప వ్యక్తి, కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్‌. దర్శకులకి సినిమా ఒక కళ మాత్రమే కాదు, ఒక తపస్సు లాంటిదని, ప్రశస్తమైన సినిమాలను సష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి. అర్ధ శతాబ్దం పైగా సినీ జీవితంలో యాభై సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఆయనకు ఉన్న పేరు ప్రతిష్టలకు వంద సినిమాలు అయినా తీయవచ్చు. అయితే రాశి కంటే వాసిని నమ్ముకున్న వాడు విశ్వనాధ్‌. అంతే కాదు ఎవరైనా నిర్మాత తన వద్దకు వస్తే మీకు నాతో సినిమా అంటే డబ్బులు రావు అని ముందే రిజల్ట్‌ చెప్పేసేవాడు. అయితే మాకు డబ్బు కాదు పేరు వస్తే చాలు మీరు మాత్రమే మా సినిమా తీయాలి అని చాలా మంది అభిరుచి కలిగిన నిర్మాతలు ఆయన వద్దకు వచ్చి సినిమాలు తీయించుకున్నారు. అలా అనేక మంది నిర్మాతలను ఆయన నిలబెట్టాడు. యువచిత్ర బ్యానర్‌ మీద కె. మురారి తీసిన తొలి సినిమాకు కె విశ్వనాధ్‌ డైరెక్టర్‌. ఆ సినిమా సీతామాలక్ష్మి ఆ తరువాత ఆ బ్యానర్‌ ఎంతో గొప్పగా ఎదిగింది. అలాగే మరో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎన్నో సినిమాలు విశ్వనాధ్‌ తోనే తీసారు. అందులో శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం అన్న క్లాసిక్స్‌ని ఎవరూ మరచిపోలేరు. విశ్వనాధ్‌తో ఒక సినిమా చేస్తే చాలు ఆ నిర్మాత పరిపూర్ణుడు అవుతాడు. నటించిన నటులు కూడా తమ జన్మ సార్ధకమయ్యింది అని అనుకుంటారు. విశ్వనాధ్‌ నూతన నటీనటులను, సాకేతిక నిపుణులను ఎందరినో వెండితెరకు పరిచయం చేశాడు. ఒక వేటూరి సుందరరామమూర్తిని ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆయన తన సినిమాల ద్వారా తెలుగు పరిశ్రమకు అందించాడు.

           కాశినాధుని విశ్వనాథ్‌ 1930 ఏప్రిల్‌ 19న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా లోని పెద పులివర్లు అనే గ్రామంలో కాశి నాధుని సుబ్రహ్మణ్యం, కాశినాధుని సరస్వతి అనే దంపతులకు జన్మిం చాడు. ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడి చినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించ లేదు. అక్కడ్నించి వారి నివాసం విజయ వాడకి మారింది. హైస్కూలు విద్యంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీ ల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశారు.
సినీ ప్రస్థానం
           విశ్వనాథ్‌ మద్రాస్‌లోని వాహిని స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, అన్నపూర్ణ సంస్థ నిర్మించిన 'తోడికోడళ్ళు' అనే సినిమాకు పని చేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆ తర్వాత అన్నపూర్ణ సంస్థ 'మూగ మనసులు, డాక్టర్‌ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు', సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1951 లో 'పాతాళ భైరవి' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన విశ్వనాథ్‌ అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా 1965 లో నిర్మించిన 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శ కత్వం వహించి దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. తరవాత ఆయన 1971 లో చెల్లెలి కాపురం, 1973 లో శారద, 1974 లో ఓ సీత కథ, 1975 లో జీవన జ్యోతి, 1976 లో సిరిసిరిమువ్వ సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్‌ సాధించి, ఆయన తన ప్రతిభతో దర్శకుడుగా నిలదొక్కుకున్నాడు.
కళాతపస్విగా తెలుగు చిత్రరంగం పై చెరగని ముద్ర
           విశ్వనాథ్‌కు రికార్డులు కొల్లగొట్టడానికి స్టార్‌ హీరోలు అవసరం లేదు, కమర్షియల్‌ సినిమాలు అవసరం లేదు. స్లో నేరేషన్‌ ఉన్నా, సినిమా నిండా పాటలు ఉన్నా, మెలోడీ సినిమా అయినా, సామాజిక అంశాలతోనైనా.. సినిమాలో కమర్షియల్‌ ఛాయలు లేకుండా కూడా హిట్స్‌ కొట్టాడు. రికార్డులు చూశాడు. అవార్డులు, రివార్డులు సాధించాడు. విశ్వనాథ్‌ టాలీవుడ్‌లో ఒక డైరెక్టర్‌ మాత్రమే కాదు. తెలుగు సినీ పరిశ్రమకి ఒక లైబ్రరీ. భావి దర్శకులకు ఒక మార్గదర్శి. సినిమా వాళ్లకు ఎన్ని తరాలైనా కరిగిపోని విలువైన జ్ఞాన సంపదని తన సినిమాల రూపంలో ఇచ్చిన దర్శకుడు విశ్వనాథ్‌. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. ఆయన మొదటి సినిమా 'ఆత్మగౌరవం' నుంచి కూడా ఒక సరికొత్త పంథాని ఎంచుకొని కళ అనేదాన్ని పెంపొందించాలని భావించి సినిమాలు తీశారు. ''ఓ సీత కథ, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, శంకరా భరణం, సప్తపది, శుభోదయం, శుభలేఖ, సాగరసంగమం, స్వాతి ముత్యం, సిరి వెన్నెల, శ్రుతిలయలు, స్వయంకషి, స్వర్ణ కమలం, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం, స్వాతికిరణం, స్వరాబి óషేకం...'' ఇలాంటి ఎన్నో క్లాసిక్‌ సినిమా లని తెలుగు వారికి అందించిన వాడు విశ్వనాథ్‌. ఈ సినిమాలన్నీ సంగీతం, సామజిక అంశాలతో కూడుకున్నవే. ఈ సినిమాలన్నింటిలో పాటలు సూపర్‌ హిట్‌. ఇప్పటికి కూడా అవి వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ప్రతి సినిమా ఆ సినిమాలో హీరోకి వాళ్ళ కెరీర్‌లో ఒక బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలన్నీ భారీ విజయాలు సాధిం చాయి. తోటి డైరెక్టర్స్‌ కమర్షియల్స్‌తో హిట్స్‌ కొట్టాలని చూసినా సాధ్యం కాని సమయంలో.. విశ్వనాథ్‌ ఇలాంటి క్లాసిక్‌ సినిమాలతో హిట్లుకొట్టారు. విశ్వనాథ్‌ తలుచుకుంటే ఎవరితో ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు. కానీ ఆయన తన పద్ధతికి కట్టుబడి సాంప్రదా యాలు, సంస్కతి, సంగీతం ప్రాధాన్యం గానే సినిమాలు తీశారు. కమర్షియల్స్‌ తోనే కాక కళతో కూడా సినిమాలు తీసి హిట్స్‌ కొట్టొచ్చు అని నిరూపించిన కళాతప స్విగా తెలుగు చిత్ర రంగంపై చెరగని ముద్ర వేశాడు.
కొత్త తరహా సినిమాలకు నాంది పలికిన విశ్వనాథ్‌
           1970వ దశకంలో తెలుగు సినిమాలలో వ్యాపారాత్మక ధోరణులు కొత్తగా మొదలైన రోజుల్లో విశ్వనాథ్‌ తన స్వాభావిక విలువలను నమ్ముకొని, కొత్త తరహా సినిమాలకు నాంది పలుకుదామని 'శంకరాభరణం' సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఆయన తోటి కళాకారుల మీదే కాకుండా సామాన్య ప్రేక్షకుడి అభిరుచి మీదా, అతను అర్ధం చేసుకొని ఆస్వాదించగల 'ఉచ్చ్వాస నిశ్వాసములు, వాయులీనాలు, స్పందించు నవనాడులు, వీణాగానాలు, ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువు లూదగా'ల మీదా అమిత విశ్వాసం ఉంచి చిత్రాన్ని విడుదల చేశాడు. అయితే ఈ కొత్త రకం సినిమాను బాక్స్‌ ఆఫీసు స్వాగతించింది. ప్రేక్షకుడికి, తన సంస్కతి, సాంప్రదాయాలను, మరచిపోతున్న కళలను గుర్తుకుతెచ్చి కొత్త రుచులను చూపించింది. వెస్ట్రన్‌ మ్యూజిక్‌ తాకిడికి రెపరెపలాడిపోతున్న సంపద్రాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే దశ్యం ఇందులో ఉంది. ఇందులో పాటలు, మాటలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 'శంకరాభరణం' సినిమా వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా శంకర శాస్త్రిని అతని నియమనిష్టలని, సాంప్రదాయాల మీద అతనికి ఉన్న నిబద్ధత, నమ్మకాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు. ఈ సినిమాలోని సంగీతం, సాహిత్యం ఇప్పటి తరానికి కూడా శ్రావ్యంగా వీనులవిందు చేస్తోంది. కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకొని శంకరాభరణం ఇప్పటికీ ఒక గొప్ప సినిమాగా ప్రజాదరణ పొందింది. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల మధ్య విశ్వనాథ్‌ సాంఘిక సమస్యల మీద, కుల కట్టుబాట్ల మీద ''సప్తపది'', కట్న దురాచారం మీద ''శుభలేఖ'' సినిమాలతో పాటు ఆత్మ ప్రబోధంతో తనను తాను తెలుసుకునే సామాన్యుడి కధతో ''శుభోదయం'' సినిమాలు తీసాడు. వీటిలో కూడా ఆయన సాంప్రదాయ సంగీతం, నత్య కళలకు ప్రాముఖ్యం ఇచ్చాడు. ఒక కళాకారుడి ఆత్మ సంఘర్షణను చిత్రీకరిస్తూ, కళాకారుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, అతను తన కళ ద్వారా ఏ విధంగా ఆత్మ తప్తిని పొందుతాడో అనే విషయాలమీద విశ్వనాథ్‌ తీసిన, ''సాగర సంగమం, స్వాతి ముత్యం, శతిలయలు, స్వర్ణ కమలం'' సినిమాలు వ్యాపారపరంగా కూడా ఘన విజయం సాధించాయి. సాంఘిక సమస్యల మీద తీసిన ''స్వయంకషి, సూత్రధారులు'' సినిమాలు విశ్వనాథ్‌ కు కళాత్మక తప్తిని మాత్రమే కలిగించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక సమస్యను వ్యక్తిగత సంఘర్షణగా చూపించిన సినిమాలు విజయవంతమైతే సాంఘిక సమస్యలను ఉద్దేశించి తీసిన సినిమాలు అంతగా ఆర్ధికంగా విజయవంతం కాలేదు. సాంఘిక ఇతివత్తాల మీద విశ్వనాథ్‌ సినిమాలు చాలా మట్టుకు సమాజం మీద వ్యాఖ్యానం లాగే ఉంటాయి కానీ వ్యక్తిగతంగా ఉండవు. 'సూత్రధారులు' సినిమా, అణగారిన వర్గాలు, వారిని శాసించే వారిలోని పశుప్రవత్తిని చర్చిస్తుంది. వారిలోని సున్నిత భావాలని మేలుకొలిపే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ఇతివత్తాన్ని ఎన్నుకున్న విశ్వనాథ్‌ కధను, తన మిగతా సినిమాలలోగానే సున్నితంగానే నడిపిస్తారు. 'సూత్రధారులు' సినిమాలో హింస వ్యక్తిగతంగా ఉండదు, చివర్లో ప్రతినాయకుడు తన తప్పు తెలుసుకొని మారినప్పుడు అది సమాజం మీద వ్యాఖ్యానం లాగానే కనిపిస్తుంది.
సామాజిక సమస్యలకు తెర రూపం
           విశ్వనాథ్‌ సమాజంలో వేళ్లూనుకుపోయిన సామాజిక సమస్య లను వెండితెరపై నిలిపి, నిలదీసి పరిష్కారాలు చూపించాడు. అవి ఆర్ట్‌ సినిమాలలో కాకుండా కమర్షియల్‌ సినిమాలలో చూపించి ఆ చిత్రాలను హిట్‌ చేశాడు. ఆచార వ్యవహారాల కన్న మానవత్వం గొప్పదని చాటిచెప్పిన 'శంకరాభరణం', మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని చెప్పిన 'సప్తపది', చేసే పని తపస్సయితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుందని స్వయంకషి, అవినీతి, అక్రమాలను ఎదుర్కోవడానికి హింస మార్గంకాదని శాంతియుతః మార్గమే ఉత్తమమని సూత్రదారులు, వరకట్నం సమస్యని సునిశిత హస్యంతో మేళవించి శుభలేఖ, ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయా ద్వేషాలు అధపాతాళానికి దిగజరుస్తాయని స్వాతికిరణం, పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన మహిళ, చిన్నపుడే భర్తపోతే ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కోంది. కష్టాల్లో ఉన్న ఆమె జీవితంలోకి అనుకోకుండా ఒక అమాయకపు యువకుడు వస్తే ఏం జరిగింది.. అని చెప్పే స్వాతిముత్యం లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఘనత విశ్వనాథ్‌కే దక్కుతుంది.
కథనంలో, పాత్రలలో వైవిధ్యం
           విశ్వనాథ్‌ చిత్రాలు కొన్నింటిలో విషయ సామీప్యం ఉన్నా కథలో, కథనంలో.. పాత్రలలో, పాత్రల నేపథ్యంలో వైవిద్యం ఉంటుంది. శారద సినిమాలో భర్తపోయినా ఉన్నాడని నమ్ముతున్న శారద ఉంటుంది. ఓ సీత కథలో తనను తాను ఒక మగ పశువు నుంచి కాపాడుకోవడం కోసం వాడి తండ్రినే పెళ్లి చేసుకున్న సీత ఉంటుంది. చెల్లెలికాపురం సినిమాలో రాము నల్లగా ఉంటాడు. స్వాతిముత్యంలో శివయ్య బుద్ది వికసించని యువకుడిలా ఉంటాడు. నేరం శిక్షలో దేవుడయ్య తను చేసిన నేరానికి తనే స్వయంగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. సిరిసిరిమువ్వ సినిమాలో సాంబయ్య డప్పు వాయించి డబ్బు సంపాదిస్తుంటే, స్వయం కషిలో సాంబయ్య చెప్పులు కుట్టి డబ్బు సంపాదిస్తుంటాడు. శారదలో ప్రజలకు సేవ చేస్తూ పేరు తెచ్చుకున్న పేరు లేని డాక్టర్‌ ఉంటాడు. అయితే విశ్వనాథ్‌ సినిమాలలో వారి వారి వత్తులు ఊరికే చెప్పుకోవడానికి కాకుండా సినిమాకు, సినీ గమనానికి ఉపయోగకరంగా ఉంటాయి.
విశ్వనాథ్‌ చిత్రాలలో నటీనటులు
విశ్వనాథ్‌ తన చిత్రాలలో నటీనటులను ఎన్నుకోవడంలో నిష్ణాతులు. ఏ చిత్రంలో ఏ పాత్రలో ఎవరిని ఎన్నుకోవాలో అందుకు తగినవారిని వారిని ఎన్నుకుంటారు. అలా ఆయన చిత్రాలకు ఎంపికయి హీరోలుగా నటిం చినవారు: నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వ రరావు, శోభన్‌బాబు, కమల్‌ హాసన్‌, కష్ణ, కష్ణంరాజు, చంద్రమోహన్‌, సోమయా జులు, బాలకష్ణ, వెంకటేశ్‌, రాజ శేఖర్‌, శ్రీకాంత్‌, అల్లరి నరేష్‌, మమ్ముట్టి, సర్వదమన్‌ బెనర్జీ కాగా, హీరోయిన్లుగా నటించిన వారు: సావిత్రి, జమున, కాంచన, వాణిశ్రీ, శారద, భారతి, రోజారమణి, జయసుధ, జయప్రధ, తాళ్ళూరి రామేశ్వరి, కవిత, రాధిక, భానుప్రియ, సబిత, సుమలత, సుహాసిని, విజయశాంతి, మంజు భార్గవి, రమ్యకష్ణ, ఆమని, లయ, ప్రియా రామన్‌ తదితరులు.
'స్వాతిముత్యం' ఆస్కార్‌ ఎంట్రీకి
           విశ్వనాథ్‌, కమల్‌హాసన్‌ కలయికలో తెరకెక్కి 1985లో విడుదలైన 'స్వాతిముత్యం' సినిమా ఆస్కార్‌ ఎంట్రీకి వెళ్ళింది. అయితే మన దేశం నుంచి అఫీషియల్‌ ఎంట్రీగా వెళ్లినా.. నామినేషన్లలో నిలవలేకపోయింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు..' పాట ఆస్కార్‌ నామినేషన్లలోకి ఇపుడు వెళ్ళినా, గతంలోనే కె.విశ్వనాథ్‌ కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'స్వాతిముత్యం' సినిమాకే ఈ ఘనత దక్కింది. అప్పటివరకు భారతదేశంలోని ఇతర భాషల సినిమాలే ఆస్కార్‌ ఎంట్రీకి సరైనవి అనుకునే పరిస్థితి ఉండేది. కానీ 'స్వాతిముత్యం' సినిమాతో ఆ ముద్ర పోయింది. ఈ సినిమాను మన ప్రభుత్వం ఆస్కార్‌కి నామినేట్‌ చేసింది. అయితే ఉత్తమ విదేశీ చిత్రం బరిలో ఆఖరి వరకు మన సినిమా వెళ్లలేకపోయింది. కానీ ఆ రోజుల్లో ఆస్కార్‌ ఎంట్రీకి అర్హమైన సినిమాగా తెలుగు సినిమా నిలిచిందంటే.. కె.విశ్వనాథ్‌ ప్రతిభ ఎలాంటిదో చెప్పొచ్చు.
50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం
           ఆత్మగౌరవం చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన విశ్వ నాథ్‌ 'సీతామాలక్ష్మి, సప్తపది, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శంకరాభరణం, స్వర్ణ కమలం, శతిలయలు, శుభసంకల్పం, స్వయంకషి' వంటి ఎన్నో సంగీత, నాట్య ప్రధానమైన ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తన సినిమాలలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత నిచ్చి, 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'శుభప్రదం'.
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలలో
           దర్శకుడుగా కొనసాగిన విశ్వనాథ్‌1995లో శుభ సంకల్పం సినిమాలో నటుడిగా అరంగేట్రం చేసి ఉదాత్తమైన పాత్రలను పోషించాడు. 1995లో వజ్రం, ద్రోహి, 2000లో కలిసుందాం రా, 2001లో నరసింహనాయుడు, 2002 లో నువ్వు లేక నేను లేను, సంతోషం, సీమ సింహం, నీస్నేహం, 2003లో ఠాగూర్‌. 2004లో స్వరాభిషేకం, లక్ష్మీ నరసింహ, 2005లో ఆటాడు, ఆంధ్రుడు, 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, 2008 లో పాండురంగడు, 2012 లో దేవస్థానం సినిమాలలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలలో నటించి మెప్పించిన విశ్వనాథ్‌ 2012 తర్వాత నటనకు స్వస్తి చెప్పాడు.
విశ్వనాథ్‌ పొందిన పురస్కారాలు
           భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను కళాతపస్వి విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం 2016 సంవత్సరానికిగాను ''దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు''ను ఇచ్చి సత్కరించింది. అంతకు ముందు 1992లో భారత ప్రభుత్వం నుంచి ''పద్మశ్రీ'' పురస్కారాన్ని ఆదుకున్న విశ్వనాథ్‌ జాతీయ స్థాయిలో ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఐదు నది అవార్డులు, పది ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డులు అందుకుని తెలుగు చలన చిత్ర రంగంలో రికార్డు సాధించారు. 1986 లో స్వాతిముత్యం చిత్రం ఆస్కార్‌ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది.
జాతీయ పురస్కారాలు పొందిన చిత్రాలు: 1980లో ''శంకరా భరణం'' చిత్రానికి జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా, 1982లో ''సప్తపది'' నర్గీస్‌ దత్‌ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రంగా, 1984లో ''సాగరసంగమం'' జాతీయ ఉత్తమ చలనచిత్రంగా, 1986లో ''స్వాతిముత్యం'' జాతీయ ఉత్తమ చలనచిత్రంగా, 1988లో ''శతిలయలు'' జాతీయ ఉత్తమ చలనచిత్రంగా, 2004లో ''స్వరాభిషేకం'' జాతీయ ఉత్తమ చలనచిత్రంగా పురస్కారాలని అందుకోగా, విశ్వనాథ్‌ 1992లో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం ''పద్మశ్రీ'' పొందారు. 2016లో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం, 2017లో రోటరీ క్లబ్‌ జీవిత సాఫల్య పురస్కారం, 2018 లో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ జీవిత సాఫల్య పురస్కారం, ''సాక్షి'' జీవిత సాఫల్య పురస్కారం, 2022లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న విశ్వనాథ్‌ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నాడు.

శంకరాభరణం రిలీజ్‌ తేది రోజే.. కళా తపస్వి కన్నుమూత..
           శంకరాభరణం సినిమాతో తన కళాతష్ణని అందరికి పరిచయం చేసిన విశ్వనాథ్‌ ఆ చిత్రం రిలీజ్‌ చేసిన ఫిబ్రవరి 2వ తేదినే ఆయన మరణించడం ఆశ్చర్యం. శంకరాభరణం చిత్రం1980 ఫిబ్రవరి 2న సినిమా రిలీజయి తెలుగు, తమిళంలో భారీ విజయం సాధించి మిగిలిన భాషల్లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంతోపాటు 'సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం....' లాంటి ఎన్నో మంచి మంచి ఆణిముత్యా ల్లాంటి సినిమాలు తెలుగు వారి తరతరాలకు అందించిన మహనీయుడు, దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఫిబ్రవరి 2 న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు

           ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సినిమాలో సంగీతం, సంభాషణలు, సాహిత్యం సమకూ రుస్తూ, నటుల నుండి ఉత్తమ ప్రదర్సన రాబట్టుకుంటూ విశ్వనాథ్‌ తీసిన సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించి వారి మన స్సులను ఆకట్టు కుంటాయి. సినిమాలో ఒక కళాకారుడి సంఘర్షణ సానుభూతితో అర్ధం చేసుకోవడమే కాకుండా అతని కష్టం, బాధ, సాధన చివరకు అతను సాధించే విజయాలతో ప్రేక్షకుడు మమేకం చెందుతాడు. మళ్ళీ మళ్ళీ మూస పద్ధతిలో తీసినా కళాకారుడి సంఘర్షణను వైవిధ్యంగా సున్నితంగా చూపించడం వల్ల చివరకు విజయం సాధించిన కళాకారుడి సాధనలో ఔన్నత్యం, పవిత్రత అర్ధం అవుతుంది. సాగర సంగమం సినిమాలో చివరన బాలు మరణం ప్రేక్షకుడిని అంతగా బాధించదు ఎందుకంటే 'నాస్తియేషాం యశః కాయే జరా మరణజం భయం'. (వయసు, మరణం అనే సాధా రణ సహజ సూత్రాలు కళకు వర్తించవు) బాలు తను శైలజకు అందించిన కళలో కలకాలం జీవిస్తూ ఉంటాడు.

           ఆయన సినిమాలు ఎన్నో చెబుతాయి. మంచి చెడులను వివరిస్తాయి. సినిమా అన్న బలమైన మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న వాడుగా ఆయన్ని చూడాలి. విశ్వనాధ్‌ ఒక పాఠశాల. ఆయన స్కూల్‌ లో అడుగు పెట్టిన వారు ఎంతటి నటుడైనా అక్కడ విద్యార్ధి కావాల్సిందే. ఎందుకంటే అంతదాకా నేర్చుకున్నది ఒక ఎత్తు. విశ్వనాధ్‌ నేర్పేది ఒక ఎత్తు. ఆయన డైలాగ్‌ డిక్షన్‌ నుంచి హావ భావాల నుంచి బాడీ లాంగ్వేజ్‌ నుంచి అన్నీ ఎంతో ఓపికగా శ్రద్ధంగా నేర్పిస్తాడు. తాను అనుకున్న ఎఫెక్ట్‌ వచ్చెంతవరకూ ఆయన అలా టేకులు తీస్తూనే ఉంటాడు. విశ్వనాధ్‌ సినిమాలలో చాలా మంది నటించారు. ఇంకా చాలా మంది నటించలేదు. దానికి కారణం ఏంటి అంటే విశ్వనాధ్‌ సినిమాలో ఒదిగిపోవాలి. ఆయన చెప్పినట్లుగా చేయాలి. అదొక అందమైన పరిశ్రమ. కళాత్మకమైన శ్రమ. అది ఒక తపస్సు. అక్కడ అందరూ విద్యార్ధులే. ఒక్కరే మాస్టార్‌ ఉంటారు. అయనే కె విశ్వనాధ్‌. ఆయన పెద్ద మాస్టారు మాదిరిగా తెలుగు సినిమాకు సరికొత్త పాఠాలు చెప్పారు. కళలోనూ సందేశం ఉంటుందని ఆ సినిమాలు కూడా వాణిజ్యపరంగా ఆడుతాయని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చాటి చెప్పిన వాడు విశ్వనాధ్‌.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రంగ‌స్థ‌ల‌మే ఆయుధం
చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.