ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ నీటి విక్రయదారు బిస్లరీ ఇంటర్నేషనల్‌ను టాటా గ్రూపు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఈ బ్రాండ్‌ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ.7వేల కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు పలు రిపోర్టులు వచ్చాయి. థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కా లాంటి టాప్ బ్రాండ్లను సృష్టించిన రమేశ్ చౌహాన్ వీటిని 1993లో కోకాకోలాకు విక్రయించారు. తాజాగా బిస్లరీని సైతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుమార్తె జయంతి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అమ్మకానికి సిద్ద పడినట్లు సమాచారం.