హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కెనడాకు చెందిన ఒంటరియో ప్రావిన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కెనడా ఆర్థికాభివృద్థి అండ్ వాణిజ్య శాఖ మంత్రి విక్ ఫెడెలి పాల్గొన్నారు. దీంతో ఇవి, ఎరోస్పేస్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో సహకారం కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందం పొడిగించబడినట్లయ్యింది.