న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఏడాది జనవరి నుంచి మోడళ్ల వారీగా పెంపు ఉండబోతోందని.. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం వెల్లడించలేదు. ఇంతక్రితం గడిచిన ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూమ్ ధరపై 1.3 శాతం మేర ధరలను పెంచింది. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరల్లో పెరుగుదల, నియంత్రణ ప్రమాణాల నేపథ్యంలో తాజాగా ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది.