Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు

Tue 31 Jan 20:17:14.603294 2023

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవంతమైన కార్యాచరణలకు నేతృత్వం వహించి, ఏళ్ల తరబడి దేశానికి సేవ చేస్తూ వచ్చిన సైనిక అనుభవజ్ఞులు తరచూ విభిన్న కెరీర్ మార్గాలను అన్వేషిస్తారు. తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని కోరుకునే వారు తమ అనుభవ సారాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. అమెజాన్‌లో, వందలాది మంది అనుభవజ్ఞులు కొత్త ఆవిష్కరణలు చేస్తూ, తమ అనుభవంతో వినియోగదారులకు మెరుగైన, ఉన్నత సేవలు అందిస్తున్నారు. అమూల్యమైన అనుభవాలతో సిద్ధంగా ఉంటూ, వారు తమ పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు నాయకత్వ సామర్థ్యాలను అనేక రకాల పాత్రలకు విస్తరిస్తున్నారు. సైనిక నిపుణలతో బలమైన నిర్మాణం, అంకితమైన ప్రోగ్రామ్‌తో, అమెజాన్ ఇండియా వారిని స్వాగతించింది మరియు కార్పొరేట్ ప్రపంచంలో తమ కెరీర్‌కు క్రియాశీలకంగా మార్చుకునేందుకు వారికి సహాయపడుతోంది. ఇండియన్ ఆర్మీలో 22 ఏళ్లకు పైగా పోరాట, సాంకేతిక అనుభవం కలిగిన రవి రెడ్డి తన పదవీ విరమణ అనంతరం, 2020లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వినూత్న వాతావరణంలోకి అడుగు పెట్టారు. సైన్యంలో పని చేసిన సమయంలో సియాచిన్, తూర్పు సిక్కింలో ఎత్తైన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్, పంజాబ్‌లో పశ్చిమ సరిహద్దులతో సహా వివిధ భౌగోళిక ప్రాంతాలలో ఆయన ఆర్మమెంట్ టెక్నాలజీ ఆఫ్ ఆర్టిలరీ & ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు ప్రధాన యుద్ధ ట్యాంకుల వినియోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు మరియు వివిధ హోదాలలో సేవలు అందించారు.  భారతదేవంలోని అమెజాన్‌లో రవి ప్రస్తుతం AWS కమర్షియల్ సేల్స్ కోసం ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ఆయన అగ్రశ్రేణి బి-స్కూల్స్‌లోని ప్రతిభకు సంస్థలో సేల్స్ మరియు స్ట్రాటజీలో వృత్తిని కొనసాగించేందుకు తన సహకారాన్ని అందిస్తున్నారు. సైన్యంలో అభ్యాసాలు, అనుభవాలతో పాటు అమెజాన్ ఇండియా టీమ్ నుంచి తనకు లభిస్తున్న మద్దతుతోనే విజయాన్ని అందుకోవడం సాధ్యమైందని తెలిపారు. దీని గురించి రవి మాట్లాడుతూ, ‘‘సేల్స్‌ విభాగంలో వృత్తిని కొనసాగించడం సైనిక నిపుణులకు సాధారణమైన అంశం కాదు. సాయుధ దళంలో 2 దశాబ్దాలకు పైగా దళాలతో పనిచేసిన నాకు ఇది నిజంగా ఊహించని కెరీర్ ఎంపిక. అయితే ఈ మార్పు చేసుకునేందుకు మొదట్లో నేను చాలా సంకోచించాను. కానీ AWS బృందం, ఇతర లీడర్ల నుంచి ప్రశంసనీయమైన మద్దతు లభించింది. ఇది  నిజంగా అందరినీ కలుపుకుని వెళ్లే  వైవిధ్యత కలిగిన సంస్థగా నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. దీని గురించి మరింత వివరిస్తూ, “అమెజాన్‌లో విభిన్నమైన సంస్కృతి, ఆవిష్కరణ మరియు ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వ్యక్తిగత సహకారాన్ని అందించే పాత్రలో పనిచేసేందుకు నాకు ప్రత్యేకమైన అవకాశం లభించింది. ఇక్కడ నేను భారతదేశంలోని AWS కోసం కొన్ని వ్యూహాత్మక ప్రాజెక్ట్‌లలో మరియు ఉద్యోగులకు నాయకత్వం వహించే పాత్రలో పనిచేశాను. దేశంలోని బి-పాఠశాలల నుంచి అత్యుత్తమ ప్రతిభావంతుల బృందానికి నాయకత్వం వహిస్తూ, శిక్షణ ఇస్తూ, వారి ఆలోచనలను మెరుగుపరిచేలా నా అనుభవాన్ని పెట్టుబడి పెడుతున్నాను. ఈ అవకాశాలు అమెజాన్‌లోని నాయకులకు మిలిటరీ వెటరన్స్‌పై ఎక్కువ నమ్మకాన్ని ఉంచడం, విజయంపై వారికి ఉన్న తపనను సూచిస్తోంది. సైన్యంలో ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మరియు నా దేశానికి సేవ చేసే మార్గాలను ఎలా కనుగొనాలో నేర్చుకున్నాను. అమెజాన్‌లో మేము మా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు పరిష్కారాలను కనుగొనడం ద్వారా వారి తరపున నిరంతరం ఆవిష్కరణలు చేస్తున్నాము. శ్రేష్ఠత స్థాయిని పెంచడంపై స్థిరమైన దృష్టి పెట్టడంతో ప్రతిరోజూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు నన్ను ప్రేరేపించేది’’ అని వివరించారు. పని ముగిసిన తర్వాత, రవి తన కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారు. రన్నింగ్, సైక్లింగ్ మరియు అప్పుడప్పుడు బాస్కెట్‌బాల్ ఆటతో తన ఫిట్‌నెస్‌ను ఆయన ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు.
అమెజాన్ ఇండియా తన సైనిక కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సైనిక నిపుణులు, వారి కుటుంబాలకు పని అవకాశాలను సృష్టిస్తోంది. సాయుధ దళాలకు చెందిన  అనుభవజ్ఞులు ఏ సంస్థకైనా అమూల్యమైన ఆస్తి. వారు విజ్ఞాన సంపదను మరియు విస్తృత శ్రేణి నైపుణ్యాలను తీసుకువస్తారు. అమెజాన్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (DGR), ఇండియన్ నేవల్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (INPA), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ (IAFPA), మరియు ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ (AWPO)తో మిలిటరీ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేసే వారి వివరాలు తెలుసుకుని, వారిని తమ సంస్థలో భాగస్వాములను చేస్తోంది. దేశవ్యాప్తంగా అమెజాన్‌లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో, అమూల్యమైన అనుభవం, విశిష్ట నైపుణ్యాల కలయికతో, సైనిక అనుభవజ్ఞులు విభిన్నమైన ప్రతిభను కలిగి ఉన్నారు. ఇది సంస్థ వైవిధ్యం. ఈక్విటీ మరియు చేరికకు సంబంధించిన నిబద్ధతను బలపరుస్తుంది. కొన్నేళ్లుగా అమెజాన్ ఇండియా తన వ్యాపారాలలో అనేక విభాగాలలో సైనిక నిపుణులను నియమించుకుంది. భారత్‌లో 2025 నాటికి 100,000 మంది సైనిక నిపుణులను, సైనికుల జీవిత భాగస్వాములను నియమించుకోవాలనే అమెజాన్ దృష్టి కోణానికి అనుగుణంగా, భారతదేశానికి సేవ చేసిన వారు కార్పొరేట్ జీవితానికి మారేందుకు మరియు అమెజాన్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు గొప్ప అవకాశాలను అందిస్తోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.