పూణె : ప్రయివేటు జనరల్ బీమా సంస్థల్లో ఒక్కటైన బజాజ్ అల యన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా మాడ్యులర్ ఆరోగ్య బీమా ఉత్పత్తి 'మై హెల్త్ కేర్ ప్లాన్'ను విడుదల చేసినట్లు తెలిపింది. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగా కవరేజీని ఎంచు కునే సౌలభ్యం దీనిలో ఉందని ఆ సంస్థ తెలిపింది. పాలసీదారులు సొంత ఆరోగ్య సంరక్షణ ప్లాన్‌ను డిజైన్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉందని పేర్కొం ది. దీన్ని అంబ్రెల్లా ప్రొడక్ట్ కింద విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ పథకంలో రూ.5 కోట్ల వరకూ సమ్ ఇన్సూర్ చేసే అవకాశం ఉన్నదని తెలిపింది.