Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పాటల నెగడు నెత్తుకొచ్చిన అందెశ్రీ నిప్పులవాగు | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

పాటల నెగడు నెత్తుకొచ్చిన అందెశ్రీ నిప్పులవాగు

Mon 07 Nov 04:16:08.548756 2022

               మనిషి అవసరాల కోసమే అరుపుల నుంచి పరివేదనలు చెందుతూ భావ వ్యక్తీకరణలో భాష పుట్టింది. మాటల రూపంలోనే భావం, భాషా రూపాలుగా ఎదిగింది. మొదట మౌఖికమే భాష. మానవ మార్పులను మనిషి అనుభవాలను లయబద్దంగా అరిచి, మాట్లాడుతూ పాటగా రూపొందింది. మనుషుల చారిత్రక క్రమాన్ని ఎక్కువగా వ్యక్తం చేసింది అనుభవ సారాన్ని చెప్పుకుంది పాటలోనే. లిఖిత భాష లేని మొత్తం కాలం పాటే జానపదులకు ఆధారం. అభివ్యక్తి కూడా. భాషకు అత్యున్నత రూపం పాట. పాటకు కదలని పెదాలు ఉండవు. స్పందించని హృదయం ఉండదు.
               తెలంగాణకు పాటకు అల్లుకున్న అనుబంధం విప్పనలవి గానిది. మఱ్ఱికి తాటి చెట్టుకు ఎంతటి పరస్పర గాఢ సంబంధం కలదో తెలంగాణకు, పాటకు అంతటి విడదీయని బంధం ముడివేయబడ్డది. తెలంగాణలో పాటను వేరి చేసి చూడలేం. పాటలలో జానపద పాటలే అసలైన పల్లె పాటలు, అవే జనం పాటలు. నిజం చెప్పాలంటే జాన పదాలకు పుట్టినిల్లు లాంటిది తెలంగాణ మాగాణం. అందుకే పాటనే పునాది చేసుకొని తెలంగాణ రైతాంగ పోరాటం మరో దశకు చేరింది. సుద్దాల హన్మంతు, బండి యాదగిరి, తిరునగరి లాంటి అనేక కవి గాయకులు నాటి ప్రజల్లో ఉన్న జానపద పాటలు ఎత్తుకొని ఆడి పాడి కైగట్టారు కాబట్టే ప్రజల పోరాటంగా నాటి సాయుధ పోరాటం మర్లడానికి, ఉద్యమం ఉరకలెత్తడానికి దోహదపడ్డది. ఆ తర్వాత పాట పరవళ్ళు తొక్కి ప్రవహించింది. తెలంగాణ ఉద్యమంలో పాట ఉరకలెత్తింది. పోరుకు పొగరు తెచ్చింది. త్యాగాలకు దారులేసింది. సై అని సైరన్‌ మోగించింది. ధూం ధాం లతో ఉద్యమాల ఊయలగా ఊర్లు అయ్యి నిప్పుల కుంపటిలాగా మారి ప్రతి ఒక్కరూ ఒక్కో కొరకాసుగా మారారు. పాట మండే జన వాగులను సృష్టించింది. అలాంటి నెగడు పాటల నెత్తుకొని ఊరూరా హోరెత్తిన అగ్ని శిఖ, జన పద యోధుడు, గాయకుడు 'లోక కవి' అందెశ్రీ తన సంపాదకత్వంలో ''నిప్పుల వాగు'' తెలంగాణ ఉద్యమ పాటని మన ముందుకు మోసుకొచ్చాడు.
అర్థ శతాబ్ధాంన్నర పాటలను ఏరి వాటిలో నుంచి కణికల్లాంటివి ఎంపిక చేసి మనముందు కుప్ప పోశాడు అందెశ్రీ. ఈ పాటలు చారిత్రక క్రమాన్ని మలుపుతిప్పే గుణమున్నవి. లోతుల్లోకి మూల మలుపుల్లోకి ప్రవహింప చేసే చేవగలవి. అవసరం అయితే పాటే ఇంజిన్‌గా మారి పరిగెత్తే శకటంలా గోచరిస్తాయి. ఉద్యమాలకు, చారిత్రక మార్పులకు, భౌగోళిక మార్పులను, వర్గ మూలాలను, వర్గ శక్తుల సంగతులను తేల్చి చెప్పే లోతు గలవి. ఆ అన్నింటినీ ఒక మలుపు మలిపి ఒక చోదక శక్తిగా ఉండేటట్లు సమాజ మార్పుకు ఉపయోగపడే పాటలు ఇవి. ఈ అన్నింటినీ ఒకాడ కుచ్చడం అనేది గొప్ప ప్రయత్నం. ఇది కూడా ఉద్యమమే. ఒక యజ్ఞమే. పాట ఉద్యమాలను సృష్టిస్తే ఆ ఉద్యమాలను సృష్టించిన పాటలను ఒక దగ్గర చేర్చడం, యేరి కుప్ప పోయడం కూడా ఒక ఉద్యమమే మరీ. కుప్ప కూడా ఏదో ఒకరోజు ఎగురుతది. అది మరో పోరాటానికి ఊతమిస్తది. రాబోయే పోరాటాలకు మార్గ నిర్దేశికం కూడా అవుతది. అంత సరుకు సరంజామా, అంత వేడి, వాడి, అంత గాఢత, అంత ఉష్ణం ఈ పాటల, కవితల రూపంలో ఈ పుస్తకంలో పారుతుంది.
వాగు వరిచేలకు మళ్ళీ పంట పొలాలను పచ్చదనంగా ఎట్లా చేస్తదో.. ఈ పాటల నిప్పుల వాగు ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తది. ప్రపంచ చారిత్రక గమనంలో చారిత్రక పరిస్థితులను, చారిత్రక అవసరాలను ఎత్తి చూపుతది. దారి కరువైన చోట దారి చూపుతది. కాటువడ్డ సమాజాన్ని కూడా క్రమమార్గంలో నడుపుతది నిప్పులవాగు. వరిచేలకు వాగు పచ్చదనాన్ని ఎక్కించి నట్లు, నిప్పుల వాగు ఈ సమాజపు పంటలకు ఏర్రదనాన్ని ఎక్కించే తత్వాన్ని నేర్పుతది. ప్రశ్నలకు పదునెక్కిస్తది. అదే కాదు రేపటి ఉద్యమ విత్తనాలను కూడా తయారు చేస్తది నిప్పులవాగు. రేపు ఉద్యమ మొక్కను పూత పూసి, కాతకాయడం కోసం మొక్కలకు నిప్పులవాగు పారి జవజీవాలను నూరిపోస్తది.
వందల మంది రాసిన 791 పాటల, కవితల సంకలనంతో నిప్పుల వాగు పుట్టుకొచ్చింది. ఇంత పెద్ద పుస్తకం మన చేతికి పట్టనంత, పట్టుకోలెనంతా కనిపించినా తిప్పుతున్న ప్రతి పేజీ మన గుండె లోతుల్లోకి ప్రవహిస్తున్నట్లు మమేకం చెందు తాము. ప్రతి అక్షరం పోరాటాన్ని, వీరులను, వారు చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తుంది. ఇది ఎన్నో పిఎచ్‌డీలకు, పరిశోధనలకు ఒక అద్భుత భాండాగారంగా కాకమానదు.
తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో తప్పక ఉండాల్సిన పుస్తకం. చేరాల్సిన అక్షర నిఘంటువులా ఉంటది. పాట కన్నతల్లిగా మారిన తెలంగాణ మాగాణపు ఇండ్లల్లో దేవుడి పటాలు ఉన్నా లేకున్నా ఈ పాటల పుస్తకం దేవరులై కొలువు దీరాల్సిన అవసరం వుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఉద్యోగ, విద్యా, వైద్య రంగాలలో, నేల అట్టడుగు వర్గాలైన ఆదివాసీ ప్రజలను ముందుకు ఎలా తీసుకు పోవాలో ఈ నిప్పుల వాగు మార్గనిర్దేశకత్వం వహిస్తది.
కనీసం దశాబ్ద కాలం పనిచేస్తే గానీ ఇంత పెద్ద పుస్త కాన్ని ఎవరూ తీసుకురాలేరు. పాటలు ఒక దగ్గర పేర్చినవి కావు. అందెశ్రీనే అన్నట్లు ''చీకిపోయిన గుడ్డముక్క లెక్కనే పాటల చిక్కుముళ్ళను సక్కగా సరి చేయ డానికి ఆరేడు నెలలు పట్టింది'' అని పుస్తక ప్రయత్నాన్ని, కష్టాన్ని మనకు నివేదిం చాడు. దీనికి ఉక్కు సంకల్పం అవసరం. వెనుదిరగని దైర్యం అవసరం. అలసి పోని శ్రమకావాలి. నిద్రలేని రాత్రులు ఎన్నో కోల్పోతే తప్పితే ఇంతటి లావాటి బుక్‌ రావడం అసాధ్యం. అంతటి శ్రమను, కాలాన్ని వెచ్చిస్తేనే అందెశ్రీ ఈ పుస్తకాన్ని సృష్టించగలిగాడు.
అందెశ్రీ పాటగాడిగా, పాటలకు అంకితమై ఉన్నవాడిగా పాటలను అమ్మని వాడిగా, పాటలను నమ్మిన వాడిగా ఉన్నాడు కాబట్టే ఇంతటి గొప్ప పుస్తకం తీసుకురాగలిగిండు. సహజంగా కవితల సంకలనాలు వస్తుంటాయి. అనేకం ఈ నేలన ఇప్పటికే వచ్చాయి. కానీ ఎంత కాదన్నా కవితల కంటే పాట ప్రభావితమైంది. తెలంగాణ పోరాటం కవిత్వాల కంటే పాటలే ఎక్కువ ప్రభావితం చేశాయి. నడిపించాయి. ఉరకలెత్తించాయి. పాటల సంకలనం రావడం అరుదే. రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరుల పాట లను నెత్తికెత్తుకున్న ఓ గొప్ప పాటగాడు అందెశ్రీ.
ఒక్క పాటగాడు ఒక్కరి పాటను కాకుండా సహచర పాటల కవులందరి పాటను నెత్తికెత్తుకొని భుజాన మోయడం, కాయలు కాస్తున్నా, సలుపులు తీస్తున్నా పదేళ్ల పాటు బరువు ఎత్తుకొని దించని ప్రయత్నం చేయడం మట్టిలోని పసిడిని తీసినట్లు నిప్పులవాగుని తీయడం గ్రేట్‌.
తెలంగాణ ఉద్యమంలో ప్రవహిస్తున్న ప్రవాహంలో కొన్ని చెడు కాలుష్యపు కాసారం కలిసి సాగినట్లుగానే కషాయం కాసారం కూడా ప్రవాహంలో కలిసింది. దాని పర్యవసానమే నేటి తెలంగాణ ప్రయాణంలో పైకి లేచిన బొడిపెలు మనకు తగులుతున్నాయి. తెలంగాణ ఆ కాసారాన్ని మెల్లిగా వేరు చేసి అవతల పారెయ్యల్సిన అవసరాన్ని తెలంగాణ సమాజపు పాటల గాయకుల కవుల మీద బాధ్యతను ఈ నిప్పుల వాగు గుర్తుచేస్తుంది.
నిప్పుల వాగు తెలంగాణ మట్టిలో దాగి ఉన్న సహజ దావానలం... బడభాగ్ని. సమాజపు ప్రకృతి విరుద్ధ చేష్టలు మితిమీరినప్పుడు, మరిగి మరిగి ఒక్కసారే అగ్నిపర్వతంలా పేలి దుష్ట ప్రయత్నాలను తుడిచేసే శక్తి ఈ నేలలో ఎప్పుడూ ఉంటుంది. ఈ పుస్తకంలో ప్రతి అక్షరం, పదాలు, పాటలు, వచనాలు, కవితలు..తన వాడి వేడిని మనకు తగిలి కర్రు పొగరుని మనకు గుర్తు చేస్తుంటాయి. అలాంటి ప్రయత్నం చేసిన నిప్పుల మనిషి అందెశ్రీకి సెల్యూట్‌.
పాట నిత్య చైతన్యపు స్పృహ. ఎండిపోయిన కంకులకు పచ్చి పాలను అద్ది సజీవం నింపే జీవదార. నిప్పుల వాగులో మునగండి, ఈదండి, అయినా మాడిపోని శక్తిని పొందే మనిషిలోని దాగిన జీవ హరితాన్ని వెలికితీసి పచ్చని సజీవ ప్రాణాన్ని హామీ ఇస్తుంది ఈ పుస్తకం. ఇది తెలంగాణ పాటల కరదీపికలా ప్రతి ఇంట్లోకి చేరాల్సినదే.

- ఏ. విజయ్‌ కుమార్‌, 9573715656

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...
సుట్ట
ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
అగ్నిశిఖల సంకేతం ..
వేగంగానే ....
గౌర హరిదాసు కథలు ఒరియా జీవిత వ్యధలు
ముందున్న మార్గం
మానవ సంబంధాలను చిత్రీకరించిన 'మా కథలు - 2020'
పర్సా సైదులు స్మారక పురస్కారాల విజేతలు
ఉగాది బాలల కథల పోటీ
8న ఫీచర సునీతరావు పురస్కారాలు
అవుటర్‌ రింగ్‌ రోడ్‌
కళ్ళజోడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.