Mon 21 Nov 05:53:53.083042 2022 అన్ని రుణాలూ డబ్బుతోనే తీర్చలేముకొన్ని రుణాలకు బతుకంతా రుణపడి పోతామంతే ..!పొద్దు పొద్దున్నే నవ్వుతో పలకరించేపూలతోటల్లాంటి మనుషుల రుణాలు ..విరగపండే పంట పొలాల్లాంటి మనుషుల రుణాలు ..నిరతం జలజీవాలతో పారేనిర్మలనదీ ప్రవాహాల్లాంటి మనుషుల రుణాలు..తీరమెంత కోతకోస్తున్నానిలబడ్డ పచ్చని కొండల్లాంటి మనుషుల రుణాలు ..బూడిదరంగు మబ్బులతో ముచ్చట్లాడేకొండకొనల్లాంటి మనుషుల రుణాలు ..నెత్తిమీద పూలబుట్టల్ని మోస్తున్నఆకుపచ్చని అడవుల్లాంటి మనుషులు రుణాలు ..లోన అఘాధాలెన్నున్నాతొణికని గంభీర సముద్రాల్లాంటి మనుషుల రుణాలు..చీకటిని సాగనంపుతున్నవెచ్చని వేకువ దీపాల్లాంటి మనుషుల రుణాలు ..ఎంతకీ తీర్చుకోలేం !కొందరుంటారుకొండా కోనా చెట్టూ చేమల్లే ఏ రక్త బంధముండదుకానీ చచ్చేదాకా వాళ్లతో తెంచుకోలేనిబంధాలేవో ముడిపడిపోతాయిఅన్ని రుణాలూ ఆస్తులతోనే తీర్చలేముమట్టిలో మట్టైనా .. కొన్ని రుణాలుతీర్చుకోలేని రుణానుబంధాలుగా మిగిలిపోతాయిరుణం తీర్చుకోకపోయినా ..వాళ్లు అడిగిందీ లేదు - ఆశించిందీ లేదు గానీవాళ్లని వాళ్లలాగే .. అంతే సహజంగా ..నీలి ఆకాశమంత నిర్మలంగా ..ఒక వేకువపొద్దున చీకటిబురదలో విరిసినతెల్ల తామరపూవంత స్వచ్ఛంగా.. వదిలేస్తే చాలు !!- సిరికి స్వామినాయుడు, 94940 10330 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి