వసుంధర విజ్ఞాన వికాస మండలి కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్రస్థాయి కవితల పోటీలు నిర్వహిస్తోంది. 'అక్షరమే ఊపిరి' అనే అంశం మీద 25 లైన్లకు మించని కవితను పదవతరగతి లోపు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే పోటీకి పంపాలి. మొత్తం ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేసి ఐదుగురికి సమాన బహుమతులు అందజేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 15 లోగా వి.సుమలత, ఇ.నెం-13-1-3/3/6/2జు, అవంతినగర్ తోట, మోతినగర్, హైదరాబాద్-500018 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 8096677409 నెంబర్‌లో సంప్రదించవచ్చు.