Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'పరంపర' గా ప్రాతినిధ్య తెలంగాణ కవిత్వం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

'పరంపర' గా ప్రాతినిధ్య తెలంగాణ కవిత్వం

Mon 21 Nov 05:57:28.77229 2022

ఆంగ్ల సాహిత్యం నుంచి అలాగే తెలుగేతర భారతీయ భాషల నుంచి కూడా అనేక ప్రక్రియల్లో కవిత్వం, కథ, నవల, చరిత్రకు సంబంధించిన విషయాలతో కూడిన రచనలు తెలుగులో అనువదించబడుతున్నాయి. తత్పలితంగా విదేశీ రచనలు, రచయితలూ, భారతీయ భాషల రచనలు, రచయితలూ తెలుగు సాహితీ రంగానికి, పాఠకులకు పరిచయ మవుతున్నారు. వారి రచనా వైశిష్ట్యం విశాలత్వం పొందుతుంది. దురదృష్టమేమిటంటే ఇతర భాషా రచనలు తెలుగులోకి అనువదించబడుతున్నా చాలా వరకు తెలుగు కవిత్వం కానీ, కథ, నవల మరి ఏ ఇతర ప్రక్రియకు సంబంధించిన రచన కానీ అనువదించబడక తెలుగు సాహితీకారులు అనండి, సృజనకారులు అనండి బయటి ప్రపంచానికి పరిచయం గాకుండా ఒక రకంగా అజ్ఞాతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఒకటి అరా రచనలకు మినహాయింపు ఉండవచ్చు. అది కూడా సుప్రసిద్ధులైన వారి రచనలు లేదా వారికి పరిచయం ఉన్న వారితో అనువాదం చేయించుకోవడమో జరుగుతుంది. వాటి గురించి ప్రస్తావించడం లేదు. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సాహిత్య అకాడమి ముందుకు వచ్చి తెలుగు కవిత్వాన్ని ప్రాచీన కవుల నుండి ఆధునిక కవులు, సీనియర్‌ కవుల నుండి వర్ధమాన కవుల వరకు వారి రచనలను హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదం చేయించి, వెలుగులోకి తెచ్చే బృహత్కార్యాన్ని భుజాలపై మోయడం అభినందించదగిన విషయం. ఈ పరంపరలో వచ్చినదే ''పరంపర'' తెలుగు కవితల హిందీ అనువాద సంకలనం.
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి, ఉద్యమ స్ఫూర్తికి, సమాజానికి ప్రాతినిధ్యం వహించే కవితల సమాహారం. 150 కవితలతో అదే సంఖ్యలోని కవులు జాతీయ స్థాయిలో వెలుగు చూసే అవకాశం. తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ తొలి అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి ప్రధాన సంపాదకత్వంలో డా. ఎం.రంగయ్య, డా. దయాకృష్ణ గోయల్‌, డా.గుండ్ల పరమేశ్వర్‌ల సంపాదక మండలి ఆధ్వర్యంలో ఈ సంకలనం రూపు దిద్దుకుంది. పాల్కురికి సోమన, పోతన లాంటి ప్రాచీన కవులు, వానమామలై వరదాచార్యులు, కాళోజి, సి.నారాయణ రెడ్డి లాంటి దిగ్గజాల నుంచి, నేటి వర్ధమాన కవుల వరకు భిన్న శైలిలో వున్న కవిత్వం ఈ సంకలనంలో ప్రతిఫలించింది.
ఇక అనువాద విషయానికి వస్తే భాష మారినప్పుడు మూలభాష ప్రాంతీయత, సంస్కృతి, నైసర్గికలతకు సంబంధించిన పదాలు దొర్లుతాయి. వాటి అనువాదం లక్ష్య భాషలోకి వెళ్ళినపుడు వాటి సహజత్వం కాస్త కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే భాష స్వరూపం, గాంభీర్యం, సారళ్యత, ధ్వని, సౌందర్యం పైన కూడా ప్రభావం పడుతుంది. గోన బుద్ధారెడ్డి రచన 'భగీరథ ప్రయత్నం'లో వున్న ప్రౌఢత్వం, ప్రవాహ వేగం, రమ్యత అలాగే పోతన పద్యాల్లోని మాధుర్యం, నడక, ఛందోబద్దంగా వున్న రూపనిర్మాణ శైలి అనువాదంలో తీసుకురావడం కష్టమే. బెజ్జ మహాదేవి వచనాలు, దున్న ఇద్దాసు తత్వాలు బాగా వచ్చాయి. ఇద్దాసు తత్వంలోని ఈ ఖండికను చూస్తే -
''పెనుగొండ బసవయ్య గురుడోయమ్మా! ఈ తోట లోపలి
మర్మమెల్ల తేటతెల్లగా తెల్పెనమ్మ
కాశీ గంగ యమునాది సరస్వతీ
చూసి తానిటు భాగవతం కృతిజేసెను సుమ్మా...''
''పెనుగొండ బసవ గురు నే సఖీ
ఇస్‌ బాగ్‌ కా మర్మ్‌ స్పష్ట్‌ బతాయా హై సఖీ
కాశీ గంగా, యమునా ఔర్‌ సరస్వతీ నదియో కో
దేఖ్‌ కర్‌ ఉన్హోనే ఇస్‌ భాగవత్‌ కి రచనా కీ హై సఖీ...!'' హిందీ అనువాదంలో అనువాదకులు షకీల్‌ అహ్మద్‌ 'సఖీ' అనే పదాన్ని చేర్చి పునరుక్తితో ఒక లయాత్మకతను అందించి పద్యాన్ని సుందరంగా నడిపారు.
గూడ అంజయ్య కవితను పరామర్శిస్తే ఆ కవితలోని పదాలలో వున్న భావ తీవ్రత, వేగం, ఇమిడివున్న ఉద్యమ స్ఫూర్తి అనువాదంలో అందుకోవడం కాస్త కష్టతర మయ్యిందనిపిస్తుంది.
''గొడ్డు గోద కోతకాయే గజ్జెలో రాజన్న
దూల వాగు నీళ్లు వాయే గజ్జెలో రాజన్న...''
డా.ఎం.రంగయ్య హిందీ అనువాదంలో ఇలా సాగుతుంది:
''జాన్వర్‌ ఏక్‌ ఏక్‌ కర్‌ కాటే జా రహే రాజన్న హే రాజన్న
మూల్‌ నాలా పానీసే రహిత్‌ బనా రాజన్న హే రాజన్న..''
సుద్దాల హనుమంతు, గోరటి వెంకన్న కవితల్లోని పల్లె పదాలు, అలాగే తెలంగాణ భాషా పదాల అనువాదం కూడా ఒదగక సహజత్వానికి దూరమైన భావన కలుగుతుంది.
భాష యాసల పరంగా అనువాదకులకు సమస్యలు ఎదురయ్యి వుండవచ్చు. ఐనా, తెలంగాణ భాష, సమాజం, సంస్కృతి, ఇత్యాది విషయాలపై దృష్టి ఉంచి శ్రద్దగా, శ్రమతో, సాహిత్య స్ఫూర్తితో అనువాదకులు కవితలను అనువదించడం లో సఫలీకృతులయ్యారు. ఈ మహాయజ్ఞం వెనక వున్న తెలంగాణ సాహిత్య అకాడమి కృషి, మార్గదర్శనం, ప్రతిభ ప్రశంసనీయం. విశిష్టమైన సాహిత్యాంశాలను పుణికిపుచ్చుకున్న కవితలను ఎన్నిక చేసి తెలుగులో మూలగ్రందాన్ని తెచ్చిన సంపాదక వర్గం సభ్యుల సాహిత్యాభిరుచి వారు పడిన శ్రమ స్పష్టంగా తెలుస్తుంది.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి ముందుమాట తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ముఖచిత్రానికి అద్దం పడుతుంది. 12వ శతాబ్దికి చెందిన పాల్కురికి నుండి 21వ శతాబ్దికి చెందిన కవుల వరకు తెలంగాణ కవిత్వ పరిణామ క్రమాన్ని, వికాసాన్నిఈ సంకలనంలో చూడవచ్చు. ఇటువంటి అద్భుతమైన అనువాద కార్యక్రమాన్ని చేపట్టి ప్రాతినిధ్య తెలంగాణ కవిత్వం 'పరంపర'గా వెలుగులోకి తీసుకురావడానికి కారకులైన ప్రతి ఒక్కరు అభినందనీయులు.

- డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌
  99088 40186

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...
సుట్ట
ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
అగ్నిశిఖల సంకేతం ..
వేగంగానే ....
గౌర హరిదాసు కథలు ఒరియా జీవిత వ్యధలు
ముందున్న మార్గం
మానవ సంబంధాలను చిత్రీకరించిన 'మా కథలు - 2020'
పర్సా సైదులు స్మారక పురస్కారాల విజేతలు
ఉగాది బాలల కథల పోటీ
8న ఫీచర సునీతరావు పురస్కారాలు
అవుటర్‌ రింగ్‌ రోడ్‌
కళ్ళజోడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.