Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మునాసు కలం... | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

మునాసు కలం...

Mon 28 Nov 03:18:06.454805 2022

           పతానం పెట్టెను పక్కన పెట్టి చాపల తట్టను నెత్తిన పెట్టుకొని ఇంటిని మోసిన ఆడ ఏసు. అమ్మ అంతా అమ్మే తన ప్రపంచం అంతా అమ్మే... తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కుటుంబ బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్నది అమ్మ అని అంటాడు మన ప్రముఖ కవి మునాసు వెంకట్‌... పొద్దంతా అమ్మ లేకపోతే... చీకటి... సాయంత్రం దీపం పెట్టే సమయానికి అమ్మ ఇంటికి వస్తూ వెలుగును వెంటబెట్టుకొని వస్తుంది. ఇల్లంతా వెలుగుతో నిండిపోతుందనీ, అమ్మ గురించి రాసిన కవితలో, రాసాడు వెంకన్న. అమ్మ కళ్ళల్లో నీళ్ళు మసులుతున్నప్పుడు, బియ్యం తెచ్చిన మామ ఇప్పుడు గొంతులో పొరపోతున్నాడనీ హద్యంగా చెపుతాడు. పేగు తీగ లాగితే అమ్మ తోడ మొలచిన మొలక మేనమామ, అయితే అక్కలు, అన్నలు వదినలు అమ్మలై... అమ్మ వాసనతో పులకించే జన్మబంధాలుగా అభివర్ణించాడు వెంకన్న.
              నాన్న వాళ్ళ ఊరు నల్గొండ పట్టణం. అమ్మది నకిరేకల్‌ దాటాకా కేతపల్లి దగ్గర ఒక పల్లెటూరు. బెస్త సామాజిక వర్గానికి చెందిన వెంకన్న, కవిత్వం చెరువు చేపల చుట్టే తిరుగు తుంది. బుద్దుడికి బోధి వక్షం కింద జ్ఞానోదయం అయినట్లే, వెంకన్నకు, పానగల్లు చెరువు,దగ్గర కవిగా అన్నప్రాసన జరిగింది.ఆయన అమ్మమ్మ ఊరు, అక్కడ మేనమామలు,ఆ గ్రామీణ వాతావరణం, అక్కడి తెలంగాణ భాష, యాస కూడా ఒక రకంగా కవిగా మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగపడింది. తెలంగాణ బాషలోనీ, జీవాన్ని, జీవితాన్ని బాగా ఆకళింపు చేసుకుని, తనదైన శైలిలో సాహితీ ప్రపంచంలో పంటలు పండిస్తున్నాడు.
అప్పట్లో, కాంచనపల్లి చిన వెంకట రామారావు, నోముల సత్యనారాయణ, బోయి జంగయ్య, ఎన్‌కే రామారావు, యాదగిరి రెడ్డిలు సభ్యులుగా నల్గొండ యువ రచయితల సంస్థ ఏర్పాటైంది. వాళ్ళు నిర్వహించే సాహిత్య సభలను, ఆసక్తితో,ఎక్కడో వెనక బెంచిలో కూర్చుని వినేవాడు, వెంకన్న.ఆ తరువాత నీలగిరి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో వచ్చిన బహువచనం అనే కవితా సంకలనంలో భాగమయ్యాడు. ఆ తరువాత కొంత మంది మిత్రులతో, గోసంగి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసి, మొగి, మేమే అనే కవితా సంకలనాలను వెలువరించారు.
మా గురువు గారిగా భావించే, ఉదయం సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌, విఎస్‌ఆర్‌ ప్రభాకర్‌, అప్పట్లో నల్గొండను బేస్‌ చేసుకుని గొడ్డలి అనే పత్రికను నడిపేవారు. అప్పటి నుంచి అందరూ ఆయనను, గొడ్డలి ప్రభాకర్‌ అని పిలిచే వారు. ఆ పత్రికలో కూడా వెంకన్న వాస్తవి అనే కలం పేరుతో కవితలు, రాసేవాడు. అంతే కాకుండా నల్గొండ స్థానికంగా రెండు సాయంకాల దిన పత్రికలు వెలువడేవి. అవి ఒకటి జగన్మోహన్‌ రావు ప్రజాపోరాటం, అయితే రెండవది యూసఫ్‌ బాబు ప్రజాపోరు. ఈ రెండూ అప్పట్లో పోటాపోటీగా నడిచేవి.
ప్రజా పోరులో వెంకన్న అసోసియేషన్‌ ఎడిటర్‌గా పని చేసారు. గొడ్డలి ప్రభాకర్‌, విష్ణు భరద్వాజ్‌ (షాడో రాజు), మునాసు వెంకన్న (వాస్తవి కలం పేరుతో) ప్రజా పోరాటం, ప్రజా పోరు పత్రికల్లో, ఉదయం పేపర్‌లో దేవీప్రియ రాసినట్లు, రన్నింగ్‌ కామెంటరీ అనే శీర్షికతో కవితలు రాసేవారు. ఈ ముగ్గురు కలిసి రేపటి కవితలు అనే సంకలనాన్ని ప్రచురించారు.
మునాసు వెంకన్న కొంత కాలం హేతువాద నాస్తిక ఉద్యమంలో కూడా పనిచేసాడు... పులిజాల నళిన్‌ కుమార్‌, కొంతమంది ఇతర మిత్రులతో కలిసి హేతువాద నాస్తిక మిత్ర మండలి స్థాపించాడు.ఆ మండలి తరఫున లవణం హేమలత, కత్తి పద్మారావులను పిలిచి సమావేశాలు కూడా నిర్వహించాడు మన వెంకన్న.
మునాసు వెంకన్న స్వీయ రచనలలో ఎన, వర్జి, మెద, కవితా సంకలనాలు, తన కవితా సంకలనం ఇంగ్లీషు అనువాదానికి ఆస్ట్రేలియన్‌ కవి ముందు మాట రాయడం గమనార్హం. జన కవితా సంకలనం అముద్రితం.... కట్‌ చేస్తే.... మునాసు వెంకన్న మరో రచన చందమామలు కవితల సంకలనం రేపు సాయంత్రం నల్గొండలో ఆవిష్కరణ కానుంది. ఆ పుస్తకాన్ని ఆళ్ళగడపకు చెందిన మట్టిముద్రణ పబ్లిషింగ్‌ హౌస్‌ ముద్రించగా, భావనా బ్రహ్మం అందంగా డిజైన్‌ చేశారు. కార్టూనిస్ట్‌ శంకరన్న గీసిన మునాసు వెంకన్న కారికేచర్‌ కవర్‌ పేజి పుస్తకానికి కొత్తదనాన్ని తీసుకువచ్చింది. అంతే కాకుండా శంకరన్న పుస్తకం లోపల గీసిన ఇల్లుస్ట్రేషన్స్‌ కూడా చాలా బాగున్నాయి.
మునాసు వెంకన్న కలం నుంచి ఇంకా అనేక కవితా సంకలనాలు రావాలనీ కోరుకుంటూ....

- ప్రమోద్‌ ఆవంచ, 7013272452

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...
సుట్ట
ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
అగ్నిశిఖల సంకేతం ..
వేగంగానే ....
గౌర హరిదాసు కథలు ఒరియా జీవిత వ్యధలు
ముందున్న మార్గం
మానవ సంబంధాలను చిత్రీకరించిన 'మా కథలు - 2020'
పర్సా సైదులు స్మారక పురస్కారాల విజేతలు
ఉగాది బాలల కథల పోటీ
8న ఫీచర సునీతరావు పురస్కారాలు
అవుటర్‌ రింగ్‌ రోడ్‌
కళ్ళజోడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.