Mon 28 Nov 03:23:19.207173 2022 ప్రత్తి పువ్వు చిట్లించినట్లుబ్రతుకు భారము మోయలేకనిగూఢంగా మనిషిగూడు కట్టుకున్నాడు నాలోని మనిషి....మిరప పండులా ఘాటుగాటుగాభాష వేషం కట్టింది....అకాల వర్షానికిజారిపడ్డ మామిడికాయతలవంచినట్టు ఆత్మవిశ్వాసం కూడానిరాశతో అడుగుగలిపింది..కన్నీరు, ఉప్పుసముద్రంగాకంటి గడప దాటి దార కట్టింది.....చేతులు, అచేతనంగా మారిమట్టి పరిమళాలను మర్చిపోయింది....పాదాలు పదును కోల్పోయిఅధమపాతంలోకి అడుగుపెట్టింది...మనిషిలో మొలకెత్తినఈ పరాయి మనిషిపరాజయగీతం ఆలపిస్తుంటే....ఉషోదయ కిరణంకొత్తగా నన్ను మళ్లీ చిత్రించిఅక్షర ఆయుధాలనుపదాల పదాతి దళంహక్కలు నేర్చుకున్న వాక్యాలనుకలగలిపి కణకణంలోనిప్పుల కుంపటినినిలిపింది.- సాదే సురేష్ 9441692519 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి