హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో పుస్తకాల ప్రదర్శనకు ఆహ్వానం
Mon 28 Nov 03:25:42.51881 2022
డిసెంబర్ 22 నుంచి తెలంగాణ కళాభారతి ప్రాంగణం (ఎన్‌టిఆర్ స్టేడియం)లో నిర్వహించ నున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో రచయితల పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఆసక్తి కలిగిన రచయితలు బుక్ ఫెయిర్ కార్యాలయంలో డిసెంబర్ 17లోగా సంప్రదించి పుస్తకాలు పంపవచ్చు. వివరాలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయం, ఇ.నెం. 1-1-80/5, మొదటి అంతస్తు, సుదర్శన్ థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్ - 020 చిరునామాలో లేదా 7207379241, 8639972160 నంబర్‌ల నందు సంప్రదించవచ్చు.