Mon 05 Dec 01:48:57.913146 2022 ఆనాడు ఊళ్లే పదిల్లకు ఒక నీళ్ళ బాయుంటే....ఇయ్యాల ఒకింటికే పది నల్లాలట...!!ఆనాడు ఒక కట్టేలపొయ్యి మీద మానేడండి పది మందికి పెడితే....!!ఇప్పుడు నాలుగు పొయ్యిల మీద పిడికెడుడికిచ్చి ముగ్గురు తింటాంర్రు..ఆనాడు తాతల అన్నదమ్ములందరుఏండ్ల సంది ఒకింట్లనే తడుకల సంసారం చేస్తే....!!ఇప్పుడు ఒక్క సంసారానికే నాలుగిండ్లు కొనిపన్నెండు పర్దాలు కట్టవట్టే.....ఆ రోజుల్ల పేదరికం కనిపియ్యకుండచినిగిన బనీను మీద తువ్వాల కప్పుకుంటే...!!ఇయ్యాల మేము ఉన్నోల్లమని తెల్వనీకిసగం బట్టలేసుకొని బజార్ల తిరుగుతాండ్రు....!!ఆనాడు ఎన్నటికో ఓపారి ఊరి దాటితేపానమంత ఇంటికాడున్న గొడ్ల మీదుండేది...ఇయ్యాల ఇల్లు దాటితే పానమంత ఆర్డర్ వెట్టిన అమెజాన్,ఫ్లిప్ కార్డ్ బార్సు మీదనే కొట్టుకుంటంది...!!ఆనాడు అన్నదమ్ములు ఏరువడుతాన్రాంటే ఇంట్లందరు ఒకింట్లనే మూడు పొయ్యిలు పెట్టుడని కండ్లల్ల నీళ్ళు తీస్తే....ఇయ్యల కల్సుంటే కాట కల్సినట్లున్నదనిమమ్మల్ని ఏరేయ్యమని లొల్లికి దిగవట్టే....ఆనాడు పండగత్తే పదొద్దుల సందే పైసల కోసం తన్లడీతే....ఇయ్యాల పైసలెక్కువై లేని పండగల్ని పుట్టితాంర్రు.....!!ఆనాడు పగటిపూట పనిత్తీరీనంక ఉప్పసకిఅరుగుబండ మీద కూకొని ముచ్చట పెడితే...ఇయ్యాల వాషింగ్ మిషిన్ల బట్టలేసి వాట్సప్‌ల చేతులతో మాట్లాడవట్టే..!సంపాదనెక్కువై సోరు దప్పి...సుఖమెక్కువై మొఖం కడుగ తీరక....లెక్కవెట్టలేనన్ని సదువులుసదివి, ముల్లెలు కట్టలేనన్ని పైసలు ఎన్కకేసిన..తీర చస్తే కండ్ల నీళ్ళు తీసి, కర్మ చేసే కన్నోడు కూడా కడకే రావట్టే....- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి