ఒక్కొక్కప్పుడు..... చెయ్యని నేరాలకు శీఘ్ర శిక్షలనుభవిస్తారు చేదు ఫలితాలను చవిచూస్తారు!
ఏ సంబంధమూ లేని ఎదిగే మొక్కలు సైతం పత్రహరితాన్ని కోల్పోయి నిర్దాక్షిణ్యంగా నిర్జించబడతాయి!
అప్పుడు... ఇప్పుడు...ఎల్లప్పుడూ! కోట్లకు కోట్లు కొల్లగొట్టే స్కీములు స్కాములు స్వాములు... నింపుకునే సొంత బొచ్చెలు!... అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అనేకానేక అడ్డదారులు!
నిచ్చెన మెట్ల నీచ కుల వ్యవస్థ నీడన నిమ్న జాతుల దీనావస్థలు! నిబద్ధత లేని కవాటాల మాటున ఒక్కో వర్గానికి వివిధ బద్ధల కొలమానాలు!! - కరిపె రాజ్‌కుమార్ 8125144729