Mon 05 Dec 01:51:10.674 2022 నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదుకేవలం ఇంతే...నిన్న ఉన్న నాహృదయం స్థానంలోనేడు గాయం ఉంది... గేయం ఉంది...నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదుకేవలం ఇంతే... నా ఎదపై బాహ్యంగా ఉండేదానివిఇప్పుడు ఎదలో జ్ఞాపకంగా ఉంటున్నావు...నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదుకేవలం ఇంతే...నువ్వు నాటిన మల్లె పూలు రాత్రుళ్లు మంచంపై ఉండేవిఇప్పుడు రాలి నేలపై...నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదుకేవలం ఇంతే...స్నానించిన నీ కురుల స్పర్శకు మేలుకువ వచ్చేది..ఇప్పుడు కంటిపై లేదు నిద్ర...నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదుకేవలం ఇంతే...నిన్నటి చదునైన స్థలంలో నేడు ఒక నివాసం ఉందిఅది అందమైన సమాధి.- పొన్నం రవిచంద్ర, 9440077499 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి