Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గౌర హరిదాసు కథలు ఒరియా జీవిత వ్యధలు | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

గౌర హరిదాసు కథలు ఒరియా జీవిత వ్యధలు

Mon 02 Jan 01:22:03.940205 2023

మసిబట్టిన అద్దమే వెలుగును మింగిన గ్రహణాన్ని స్పష్టంగా చూపుతుంది. మకిలిపట్టిన ఎవ్వరికీ అక్కర్లేని జీవితాలు సమాజ పోకడని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. బెంగాలీ జీవితాల్ని శరత్‌ టాగోర్‌లు పరిచయం చేసినప్పుడు ఈ మనుషులేమిటి ఇరుగు పొరుగునే వున్నట్టున్నారు అనిపించేది. ఉత్తరాంధ్ర సరిహద్దులతో మిళితమైన ఒరియా జీవితాలు అటు బెంగాలీ, ఇటు తెలుగు జీవితాల్లో మమేకమైనట్టు తోస్తాయి. గౌర హరిదాసు పరిచయం అక్కర్లేని కథకులు. జీవితంలో ఎదురయ్యే అతి సామాన్య విషయాలే వారి కథా వస్తువులు. ఆ సామాన్య విషయాలే కథలైపోతే ఎవరు రాసినా కథలు కావాలి కదా?
వంట సామాగ్రి అదే అయినా హస్తాన్ని బట్టి రుచి మారినట్టు, హరిదాసు చేతిలో అదేమిటో అతి సాధారణమైన జీవితాలు వెంటాడే కథలై పోతారు. శరత్‌ చంద్రుడి పాత్రల్లాగే ప్రణాళికలేమీ లేకుండా వెళ్ళిపోతారు. టాగోర్‌ కథలో ముగింపుకు నడిపే ఒక కరుణా పూరిత ఆర్ధ్రత అంతర్లీనంగా ద్యోతకమైనట్టు శరత్‌బాబు కథల్లో కనబడదు. గౌర హరిదాసు కథల్లోనూ అదే ప్రవృత్తి కనబడుతుంది.
ఇంటికొచ్చే ఎందరో మామయ్యలకు ప్రతీక బాటా మామయ్య. మామయ్యలతో మన నాస్టాల్జిక్‌ మెమరీజ్‌ మనని ఆ రోజుల్లోకి తీసుకెళుతుంది. చిన్నప్పటి గాజు బొమ్మ లాంటి స్మృతి, పూర్తిగా తలకిందులుగా అసిమిలెట్‌ కానంత తీవ్రంగా గాజు పెంకులై సలిపే సందర్భం వచ్చినప్పుడు అదెంత బాధాకరమో ''గాజు బొమ్మ'' కథ చెబుతుంది.
తండ్రీ కొడుకుల మధ్య వుండే వ్యక్తం చేయలేని అనుబంధం గురించి చెప్పే సంఘటనని ఎంతో అద్భుతంగా చెబుతారీ కథలో. తన ప్రతీ అవసరాన్నీ తన మనసులోకి రాకముందే పసిగట్టి అమర్చిపెట్టిన నాన్న చిన్నప్పటి హీరో స్థాయి నుంచి క్రమంగా మన అభిప్రాయాల్ని గౌరవించలేని విలన్‌గా, మంచాన పడ్డాక వేస్ట్‌ మేనేజ్మెంట్‌గా అనుకోనూ లేక, అలా అని వర్దీ టు బీ లివ్డ్‌ గా భావించుకోనూ లేక, సడన్‌గా ''త్వరగా కాలం చేస్తే బావుండు'' కదా అనే పరిస్థితి ఎందుకొస్తుంది అనేది ఎవరికీ తెలియదు. దీస్‌ థింగ్స్‌ హాపెన్‌! అనుకునే భావన ఎలావుంటుందో ''తండ్రి'' కథ చెబుతుంది. అదే సమయంలో ''ఇల్లు'' కథ కూడా పట్టణ సంస్కృతిలో ఉద్యోగాలు చేసే కొడుకులు ఇంటి కోసం తండ్రి పడే తాపత్రయాన్ని ఎలా తీసుకుంటారో భలేగా చెప్పారు. ''పాపం'' కధా, ''కసింద చెట్టూ'' విక్టర్‌ హ్యూగో లే మిసరబిల్స్‌లో జీన్‌ వాల్‌ జీన్‌ని వెంటాడిన గిల్టీ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. చెమీ బౌరానీ జీవితం గుండెల్ని పిండేస్తుంది.
''అహల్య పెళ్లి'' లో భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఒక అనాచారాన్ని తన అవసరం కోసం బతికించుకొనే నైత్యాన్ని ఆధునిక ప్రపంచం కూడా ఎలా కొనసాగిస్తూ వస్తోందో ఇందులో హృదయ విదారకంగా చూపారు. ఒక అనాధ పిల్లగా వచ్చిన అహల్య ఇంట్లో అందరికీ పెండ్లిండ్లు కాగానే నీకూ చేస్తాం అని నమ్మించుతూ గొడ్డు చాకిరీ చేయించుకుంటూ వుంటారు అహల్యతో. ఆ ఇంటి చివరి పెండ్లి కూడా అయ్యాక ఇంక తనకి ఎవర్నో ఒకర్ని తెచ్చి ముడి వేస్తారులే అనుకుని కలల్లో తేలిపోయే ఆ పిచ్చి తల్లికి సారెతో పాటూ తననీ సరకు చేసి బండి ఎక్కించినప్పుడు ఆ హృదయం ప్రిదిలి పోతుంది.
''బంగారపు ముక్క'' అమ్మ హృదయాన్ని ఆవిష్కరించే కథ. ''ఏకు మేకు'' కథలోని నకుల్‌ నాయక్‌ నీ, అతని మరగుజ్జు మనస్తత్వాన్ని చూపినప్పుడు ఇలాంటి మన పొరుగున వున్న నకుల్‌ నాయక్‌ని ఈయన ఎప్పుడు చూశారబ్బా అనిపిస్తుంది.
సూక్ష్మంలో మోక్షమన్నట్టు ఒక చిన్న కథా కాన్వాస్‌ పై ఒక మానవ జీవితం తాలూకూ రంగు రంగుల రాగ ద్వేషాల నీడల్ని ఇంత ప్రతిభావంతంగా ఆవిష్కరించడం మామూలు విషయమేమీ కాదు. పట్టుమని పన్నెండైనా లేని ఈ కథా సంపుటిలో తారసిల్లే రంజులు అమ్మలు, నాన్నలు, మామయ్యలను చూట్టానికి ఒరియా వెళ్లాల్సిన అవసరంలేదు. వాళ్ళు మనింట్లో, మహా అయితే మన పొరుగింట్లో వుంటారు.
బడుగు బతుకుల జీవిత చిత్రాలు ఎక్కడైనా ఒక్కటే. ఇంక అనువాదం చేసిన కె.వి.వి.ఎస్‌.మూర్తి అనేక ఆంగ్ల రచనల్ని పాఠ కలోకానికి చేరువచేసిన పరిచయం అక్కరలేని అనువాదకులు, స్వయంగా కథకులు. ఒరియా సంస్కృతితో పెనవేసుకుపోయిన బాంధవ్యం ఈనాటిది కాదు. ఒరియా పేర్లు ఒకటో రెండో వచ్చి నప్పుడు తప్ప ఇది అనువాదమా అని ఆశ్చర్యపోయేలా చేశారు.
పొరుగున వుండే గొప్ప కథకుడ్ని తెలుగు వారికి పరిచయం చేసిన మూర్తి అభినందనీయులు.

- వి.విజయ్‌కుమార్‌

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ
విజయ తపస్సు
సక్లముక్లం పెట్టుకొని
చివరి ప్రేమలేఖ
అవాంఛిత అర్థ విపరిణామం
కుక్కలున్నాయి జాగ్రత్త..!
మూలంకన్నా అనువాదం గొప్పగా ఉండొచ్చా?
కవన వెన్నెల కల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.