ఉత్కంఠమైన కాలం కరిగిపోతుంది కాల గర్భంలో కలిసిపోతుంది కుంచించుకు పోతున్న మెదళ్ల మొదళ్ల మధ్య అగ్గి రాజేస్తూ.. సమయం సచ్చీలంగానే బాధల బంతిని వేగంగా గిరాటు కొట్టింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
కురస ఆట మోజులా ఒలికి పోతున్న క్షణాలను ఉబుకుతున్న ఉద్వేగంతో ఎంతో తీక్షణంగానే తిలకించాము మనం హిరోలమో జీరోలమో తెల్చేసే కాలం కొత్త క్యాలెండర్ మీద కొలువైంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
ఎన్ని పథకాలను డైరీలో లిఖించుకోలే ఎన్ని ప్రారబ్థాలను పేజీల్లో తిప్పేసుకోలే మళ్లీ మళ్లీ తిరోగమనంలోకి వద్దు అన్నింటా వేగం దౌడు తీస్తోంది
బాధలోనూ బ్రతుకులోనూ.. కాలమెప్పుడూ కొత్తగా ఓ బూచోడిని సృష్టిస్తుంది భయంలో బ్రతకటానికో బ్రతుకే భయం కావటానికో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ
చీకటి వాకిట్లోని దయ్యం పిళ్లోడు కాపు గాసుకొని కాలాన్ని గీస్తుంటే..! విధ్వంసమవుతున్న మానవీయ విలువల మధ్య నువ్వొక ఇరవైగా నేనొక ఇరవైగా కృంగిపోయాం..కూలిపోయాం ఇప్పుడిది ట్వంటీ ట్వంటీ త్రీ వన్... టూ... త్రీ.... స్టార్ట్ ఉరు షెల్ ఓవర్ కమ్...
అలా నిస్తేజంగా నిశ్శబ్థంగా నిట్టూర్పు విడుస్తూ కూర్చోకు కాలం నీ ముందు మోకరిల్లదు లే..నడువ్..పరుగులుతీరు యూ విల్ విన్..యూ విల్ విన్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ..!