Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం

Sun 08 Jan 22:33:32.090998 2023

        కథలు, కవితలు రాస్తూ, సాహితీ విమర్శలు చేస్తూ, అనువాదాలు చేస్తూ నిత్యం సాహితీ సృజనలో మునిగి ఉండే గొప్ప మానవతావాది పి. శ్రీనివాస్‌ గౌడ్‌. ఆయనలో ఉద్యమకారుడూ ఉన్నాడు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న వారిలో శ్రీనివాస్‌ గౌడ్‌ ఒకరు. బహుముఖంగా తన ప్రస్తావన కొనసాగిస్తున్న శ్రీనివాస్‌ గౌడ్‌ నుంచి వెలువడిన కవిత్వం ధైర్య వచనం.
2012 నుంచి 2020 వరకు రాసిన కవిత్వాన్ని ధైర్య వచనంలో చూస్తాము. సున్నితమైన భావ వ్యక్తీకరణతోనే పదు నైన భావజాలాన్ని పాఠకులకు చేరవేయడంలో కృతకృత్యుల య్యారని చెప్పవచ్చు. పుస్తకంలో 57 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని వైవిధ్యతను చాటే పుస్తకంగా తప్పక నిలుస్తుంది. ఎక్కడా కఠినమైన పదాలు వాడకుండా, చెప్పాల్సిన అంశం నుంచి పక్కకు తొలగకుండా తన భావాలను వ్యక్తీక రించారు. సాధారణ పాఠకులు సైతం సునాయాసంగా చదువు కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక పుస్తకంలోని కవితలను పరిశీలిస్తే...
కవి ఎప్పుడూ బడుగూ బలహీన వర్గాల పక్షమే వహిం చినట్లు స్పష్టంగా అర్ధమౌతుంది. అందుకే ఇలా కవిత్వ మయ్యారు. ''పుడకా పుడకా చేర్చి గూడల్లే పులుగల్లే... / మాటా మాటా కూడదీసుకొని/ గుండె శకలాలు ఒక్కొక్కటి చేరదీసుకొని.. / నాలో నేనే అనుకుంటా / నిర్మించూ... నిర్మించని...''
వ్యవస్థలోని లోటుపాట్లపట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి ఆయన. మనిషి మీద సంపూర్ణ నమ్మకం కూడా ఉంది. చాలాసార్లు వ్యవస్థ బలహీనపడి నప్పుడు మనుషులే దయా దీపాలుగా ఉద్భవిస్తారు. వారే దేశానికి ఆశాలతలంటారు కవి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై ప్రజలు పిట్టల్లా రాలుతున్న కాలం అది. పాలకులు చేష్టలుడిగి కలుగుల్లో దాక్కున్న కాలం కూడా అదే. అంతా స్తంభించిపోయింది. ఎటు చూసినా శూన్యం ఆవరించి ఉంది. ఆ సమయంలో ఎటూ దిక్కు తోచని వలస కార్మికులను వేగంగా చేర వేసే రవాణా వ్యవస్థ లేదు. ప్రాణాలు విడిస్తే సొంత గడ్డపైనే విడవాలనే ఒకేఒక ఆశతో వేలాది కిలోమీటర్లను నడుస్తూ సొంతూరి బాటపట్టారు వాళ్ళు. అటువంటి సమయంలో వారికి అండగా నిలబడి చేతనైన సాయం చేసిన నిజమైన మనుషులకోసం అందమైన కవితను సృష్టించారు.
''తలుపులు కిటికీలు హృదయాలు మూసుకొని / నగరాలు రోడ్డు మీదకు వదిలేస్తే.. / రెక్కలు కొట్టుకుంటూ / వలసపాట పాడుకుం టున్న బక్కకూలిపక్షులకు/ దారిచూపే బాట లవుతారు బావుటాలవుతారు'' శ్రామిక మధ్య తరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి జీవితాల్లోని ఆవేదనను కవితాత్మకం చేస్తారు.
సహజతను ఎక్కడా కోల్పోకుండా అతి జాగ్రత్తగా సామాన్య మైన అక్షరాలలో ఒదిగిపోతారు. అవన్నీ ఉన్నతమైన భావాలను ప్రకటిస్తాయి. మనిషిని అంటుతీగలా అల్లుకొని నిలువెత్తు చెట్టులా నిలబెట్టేది సాహిత్యం మాత్రమేనని నమ్ముతారు శ్రీనివాస్‌గౌడ్‌.
''నమ్మకం సడలిపోయి/ మనిషి పడావు పడి కూలిపోయినప్పుడు/ నెర్రెలిచ్చిన కళ్ళలో/ ఒక ఓదార్పు చినుకు కోసం/ గుండెనంతా ఒక ఎదురుచూపు చేసి/ దారినిండా పరచి అలమ టిస్తున్నప్పుడు/ అప్పుడు../ అప్పుడు../ అదొక రూపం వెతుక్కుంటుంది/ ఒక మనిషి రూపం తొడుక్కుం టుంది'' అంటారు ధైర్యవచనం అనే టైటిల్‌ కవితలో. మనుషుల మధ్య అంతరాలన్నీ ఎక్కడో ఓ చోట అంతమవ్వాలని కోరుకుంటారు.
''పాయలు పాయలుగా చెల్లాచెదురై/ చిందర వందరగా పారుతున్న/ చిరుపాయలన్నీ కలవాలి/ మట్టి చేతుల కలలు గెలవాలంటే / ఎక్కడెక్కడి పాయలన్నీ కలవాల్సిందే..'' అంటూ తనలోని ఐక్యతా రాగాన్ని ప్రకటిస్తారు.
ఇలా మట్టి తత్వాన్ని అలవర్చుకుని, మనిషి తనాన్ని కలగనే ఈ కవి రాసిన ధైర్యవచనం సంపుటికి అంతే మట్టి వాసనను శ్వాసించిన మహాకవి మద్దూరి నగేష్‌ బాబు స్మారక కవితా పురస్కారం 2020 - 2022 కు గాను లభించింది. ఈ నెల 10వ తేదీన విజయవాడలోని ఠాగూర్‌ గ్రంథాలయంలో సాయంత్రం 5గంటలకు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌కు అభినందనలు. అలాగే ఇదే వేదికపై మరో ఐదు స్ఫూర్తి పురస్కార బహుమతులు అందు కోబోతున్న 'నెత్తుటి పాదాలు' - సరికొండ నరసింహరాజు, 'తిప్పుడు పొట్లం' - డా.గూటం స్వామి, 'ధిక్కార ఖడ్గం' -అవనిశ్రీ, 'ఒంటి రొమ్ము తల్లి' - అమూల్య చందు, 'మా నాయిన పాట' - సుంకర గోపాల్‌ కు శుభాకాంక్షలు.
(మహాకవి మద్దూరి నగేష్‌ బాబు స్మారక కవితా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..)

- నస్రీన్‌ ఖాన్‌
  9652432981

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ
విజయ తపస్సు
సక్లముక్లం పెట్టుకొని
చివరి ప్రేమలేఖ
అవాంఛిత అర్థ విపరిణామం
కుక్కలున్నాయి జాగ్రత్త..!
మూలంకన్నా అనువాదం గొప్పగా ఉండొచ్చా?
కవన వెన్నెల కల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.