Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏ రకమైన అనువాదం మంచిది? | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

ఏ రకమైన అనువాదం మంచిది?

Mon 09 Jan 00:06:03.605318 2023

           మూలవిధేయ అనువాదం, స్వేచ్ఛానువాదం, అనుసృజన అనే మూడు రకాల అనువాదాలను పేర్కొంటున్నాం మనం ఈ రోజుల్లో. వీటిలోని చివరిది నిజానికి అనువాదం కిందికి రాదని చెప్పవచ్చు, ఒకరకంగా. అను అనే ఉపసర్గకు అనుసరించి లేదా తరువాత అనీ, అనుసృజనకు recreating something అనీ అర్థాలు కనిపిస్తాయి నిఘంటువుల్లో. అంటే మూలంలో ఉన్న దాన్ని అనుసరించి ప్రతిసృష్టి చేయడం అన్నమాట. ప్రతిసృష్టి అనువాదమెలా అవుతుంది? కానీ అనుసృజన అనే మాటను లిటరల్‌గా తీసుకోకుండా, అందులో 'సృజన' అన్న పదమున్నదనే విషయాన్ని పూర్తిగా మరచిపోయి, దాన్ని అనువాదాలలోని ఒక రకం కింద జమ కడుతున్నారు.
          ప్రారంభంలో చెప్పిన మూడు రకాలలోని మొదటిదాంట్లో అనువాదకుడు అతి తక్కువ స్వేచ్ఛను, రెండవదానిలో కొంచెం స్వేచ్ఛను, మూడవదాంట్లో చాలా ఎక్కువ స్వేచ్ఛను తీసుకుంటాడు. ఈ స్వేచ్ఛ తీసుకోవడమన్నది భాష పరంగానా, లేక భావం పరంగానా? ప్రత్యేకంగా చెప్పకపోతే భావం పరంగా అనే అనుకోవాలి. భాష పరంగా అనుకుంటే అప్పుడు మూల విధేయ అనువాదం  (faithful translation)కు, యథాతథ అనువాదం  (verbatim, or literal translation) కు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడానికి మనం నిరాకరిస్తున్నామన్న మాట. రెండూ ఒకటే అని కొన్నిచోట్ల కొందరు చెప్పినప్పటికీ యథాతథ = as it is, మూలవిధేయ = faithful. యథాతథ faithfulness ను సూచించడం లేదు. కాబట్టి, ప్రత్యేకంగా వివరించనప్పుడు ఈ రెండు వేరువేరు. అయితే మూలవిధేయ అనువాదం నాణ్యమైనది, యథాతథ అనువాదం దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. గొప్ప అనువాదకులలో చాలా మందికి ఈ అభిప్రాయమే ఉంది. మూలవిధేయ అనువాదాన్ని ముక్కకు ముక్క అనువాదంగా పొరబడటం తప్పు అభిప్రాయానికి కారణమౌతున్నది. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పాలి:Literal translation వేరు, literary translation వేరు. మొదటిది మక్కీకి మక్కీ అనువాదం, రెండవది సాహిత్యానువాదం.
పాబ్లో నెరూడా స్పానిష్‌ భాషలో రాసిన ఒక కవితకు ఆంగ్లానువాదం Sonata with Some Pine Trees. ఇందులోని మొదటి మూడు పంక్తులను వివిధ రకాలుగా తెలుగులోకి అనువదించి, మూడు రకాల మధ్య ఉన్న భేదాన్ని ఔత్సాహిక అనువాదకులు గుర్తించేలా చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాను. పరిశీలించండి. ఎవరైనా ఇంతకన్న బాగా అనువదించి వివరించగలరేమో.
English version :
In the half-sun of long days
let us draw our tired
bones together

యథాతథ/ముక్కకి మక్క / verbatim/literal అనువాదం :
పొడవైన రోజుల సగం సూర్యునిలో
మన అలసిన ఎముకలను
కలిపి ఒక్క దగ్గరికి లాక్కుందాం

స్వేచ్ఛానువాదం :
తీగసాగిన పగళ్ల లేలేత ఎండలో
నిస్సత్తువ నిండిన మన అవయవాలను
ఒక్కచోట చేర్చుదాం

అనుసృజన :
కొన్నిసార్లు రోజులు భారంగా గడుస్తాయి
ఆకాశం మబ్బుపట్టి దుఃఖం చీకటి రూపమెత్తుతుంది
అప్పుడు నీరసించిన మన శరీరాన్ని కూడగట్టుకుందాం

మూలవిధేయ అనువాదం:
దీర్ఘమైన పగళ్ల పాక్షిక సూర్యరశ్మిలో
మన అలసిన అవయవాలను
ముడుచుకుందాం
వీటిలో కొందరికి 4 వ దానికన్న 2 వది నచ్చడం మరీ ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ విచిత్రమేమిటంటే, కొందరికి 3 వది అన్నిటికన్నా ఎక్కువగా నచ్చుతుంది. అనువాదం సరిగ్గా జరిగిందా లేదా చెప్పాలంటే దాన్ని మూలంతో tally చేసి చూడటం తప్పనిసరి. తర్జుమా అయింతర్వాత ఏర్పడిన text బాగుండటం వేరు, అనువాదం 'సరిగ్గా' (proper గా కాదు, correct గా) జరగడం వేరు. తర్జుమా చేసేటప్పుడు అనువాదకుడు తన సృజనాత్మకశక్తిని ప్రదర్శించేందుకు ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మూలకవి/ రచయిత ఏం చెప్పాడో దాన్నే చెప్పాలి.
English version లోని days కు అర్థం రోజులు కాదు. ఇక్కడ సayర అంటే రాత్రులకు వ్యతిరేకమైనవి అన్నమాట. Day ను దినం అని అనువదిస్తే రాత్రికి వ్యతిరేకమైనది అని కాకుండా రోజు (24 గంటల కాలం) అనే అయోమయం తలెత్తవచ్చు. కాబట్టి, పగలు అనక తప్పదు. కానీ పగలు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వ్యాపించిన కాలవ్యవధి కాదు. అయినా దినంకన్న పగలు బాగా సరిపోతుంది. ఇక అదే పంక్తిలోని half-sun అంటే సగం సూర్యుడు కాదు.Sun కు ఉన్న ఎండ అనే మరో అర్థం తీసుకోవాలి. అదేవిధంగా bones అంటే ఇక్కడ ఎముకలు కాదు, అవయవాలు లేదా కాళ్లుచేతులు. నిజానికి ఈ మాటకు essence, core, heart అనే అర్థాలు కూడా ఉన్నాయి.
యథాతథ అనువాదంలో ఈ మూడు మాటలకు  (days, sun, bones కు) మక్కీకి మక్కీ తర్జుమా జరగడం కారణంగా మూలంలోని భావం నుంచి పూర్తిగా పక్కకు పోయింది. ఇది మూలవిధేయ అనువాదం కాదు, యథాతథ అనువాదం అని గమనించాలి. స్వేచ్ఛానువాదంలో తీగసాగిన, లేలేత ఎండ, నిస్సత్తువ నిండిన... ఇవి స్వేచ్ఛ తీసుకోవడం వలన ఏర్పడిన మాటలు. అనుసృజనలోని మొదటి పంక్తి  English version లో లేనే లేదు. రెండవ పంక్తి కూడా English లోని మొదటి పంక్తికి దూరంగా పోయి చేసిన తర్జుమా. ఆంగ్లంలోని మొదటి పంక్తిని తెలుగులో రెండు పంక్తులుగా రూపొందించడం జరిగింది. దీనికి కారణం అతిగా స్వేచ్ఛ తీసుకుని అనువదించడం. ఒక unit of thought మూలంలో ఎన్ని పంక్తుల్లో ఉంటే అనువాదంలో కూడా అన్నే పంక్తుల్లో ఉండాలని అనడం లేదు. కానీ ఇక్కడ జరిగిన సంగతిని చెప్తున్నాను. చివరిదైన మూలవిధేయ అనువాదంలో భావాన్ని ఉన్నదున్నట్టుగా దించడం కోసం చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. దాంతో పాటు భాష కూడా సమాంతరంగా ఉండేలా ప్రయత్నించిన మాట వాస్తవమే. కానీ దానికోసం భావాన్ని ఉన్నదున్నట్టుగా దిగుమతి చేయడంలో నిర్లక్ష్యం జరగలేదు. ఒక రకమైన balancing act (సమతుల్యతా చర్య) చేయబడింది ఇక్కడ.
కొందరు అనువాదకులు మూలంలోని పదాలకు సాధ్యమైనంత తరచుగా, సాధ్యమైనంత దూరంగా పోతేనే మంచి అనువాదం ఏర్పడుతుందని అనుకుంటారు. ఉదాహరణకు మూలంలో pond అని ఉంటే అనువాదంలో నది అనీ, highway అని ఉంటే పిల్లబాట అనీ అనువదిస్తారు. మాటలను ఉన్నదున్నట్టుగా తర్జుమా చేస్తే అది ముక్కకు ముక్క అనువాదం అవుతుందేమోనని వాళ్ల భయం. కానీ అది అనవసరమైన భయం. సరైన సమానార్థక పదాన్ని పట్టుకోలేకపోవడం కూడా అటువంటి పరిస్థితికి కారణం కావచ్చు. పదాలే ముఖ్యం కాదు కదా అని ప్రశ్నిస్తే, పదాలు భావం నుండి పూర్తిగా స్వతంత్రమైనవా అని మారుప్రశ్న వేయాల్సి వస్తుంది. మాటల ద్వారానే మనం భావాన్ని వ్యక్తీకరిస్తాం. ప్రతి మాటకు కాకపోయినా కొన్ని కీలకమైన మాటలకు మాత్రం కచ్చితమైన అనువాదం జరగాలి.
ఇంత విపులంగా వివరించినా కొంత మంది మూలవిధేయ అనువాదాన్ని కాకుండా ఇతర రెండు రకాలను ఇష్టపడవచ్చు. దానివలన ఇబ్బంది ఏం లేదు. ఎవరికి నచ్చినదాన్ని వాళ్లు పాటించాలి. ఐతే, ఈ వ్యాసం సరైన అవగాహనను కలిగించే ఉద్దేశంతో రాయబడింది.

- ఎలనాగ

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ
విజయ తపస్సు
సక్లముక్లం పెట్టుకొని
చివరి ప్రేమలేఖ
అవాంఛిత అర్థ విపరిణామం
కుక్కలున్నాయి జాగ్రత్త..!
మూలంకన్నా అనువాదం గొప్పగా ఉండొచ్చా?
కవన వెన్నెల కల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.