నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్ యాత్ర ఆవిష్కరణ
Mon 23 Jan 01:17:39.681894 2023
కూరెళ్ల పద్మాచారి యాత్రా రచన ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్ యాత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా పీజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.డా|| ఎన్. రఘు అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి డా|| ఎన్ గోపి ముఖ్య అతిథిగా, డా|| వోలేటి పార్వతీశం విశిష్ట అతిథిగా, ఆచార్య సూర్యధనంజయ్, డా|| మచ్చ హరిదాసు ఆత్మీయ అతిథులుగా హాజరు కానున్నారు.