హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రటిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరోసారి తూట్లు పడ్డాయి. ప్రతి ఇంటికి మంచినీరు అందించే పథకం రోడ్లమీదే ఆవిరైపోతుంది. కాగా, సోమవారం ఉదయం ఖానాపూర్ మండలంలోని 365 జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ మరోసారి లీకైంది. పైప్ లైన్ లీక్ కావడంతో భగీరథ నీళ్లు రోడ్డుమీద వరదలై పారుతున్నాయి. కాగా, నెలల తరబడి పంటను ఆశించిన రైతు కళ్లలో మిషన్ భగీరథ పైప్ లైన్ నీరుపోసినట్లయింది. రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం మొత్తం నీటిపాలు అయ్యాయి. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిమంటున్నారు. వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.