హైదరాబాద్: ఏబీఎన్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని వీరికి సీఐడీ అధికారులు సూచించగా వెంకటకృష్ణ 10.20 గంటలకే న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణతో కలిసి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వీరితో పాటు బీజేపీ నేత మువ్వా సత్యనారాయణ, టీడీపీ నేత రాయపాటి సాయికృష్ణ కూడా ఉన్నారు. వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వీరిని సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు.