ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలి: భట్టి విక్రమార్క
Mon 05 Dec 15:05:03.246122 2022
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడుతూ ధరణి పోర్టల్ ను వెంటనేరద్దు చేయాలని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. భూమిలేని నిరుపేదలకు భూపంపిణీ చేయాలన్నారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.